Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో తెలుగు నేర్చుకుంటుంది
By: Tupaki Desk | 6 May 2020 1:00 PM ISTచిలసౌ.. హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ ముంబయి ముద్దుగుమ్మ చిన్న సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అందంతో పాటు అభినయం కూడా ఉన్న రుహాని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుంది. ముందు ముందు మరిన్ని ఆఫర్లు కూడా వస్తాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మంచి స్కోప్ ఉన్న నటి అంటూ రుహానికి పేరుంది. అందుకే ఆమె వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో తెలుగు నేర్చుకునే పనిలో పడినదట.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రుహాని శర్మ ఆన్ లైన్ ద్వారా ఇంకా హైదరాబాదీ స్నేహితుల సాయంతో తెలుగు నేర్చుకుంటుందట. ప్రతి రోజు రెండు గంటల సమయంను ప్రత్యేకంగా రుహాని తెలుగు నేర్చుకునేందుకు కేటాయించిందట. తెలుగు మాట్లాడటంతో పాటు చదివేందుకు కూడా ట్రైనింగ్ తీసుకుంటుందట.
రుహాని శర్మ ప్రస్తుతం ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న డర్టీ హరీ చిత్రంలో.. మంచు విష్ణు సరసన మోసగాళ్లు చిత్రంతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా రుహాని శర్మ నటిస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.
మూడు సినిమాలు సక్సెస్ అయితే రుహాని శర్మకు టాలీవుడ్ టాప్ స్టార్స్ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో మరింత క్రేజీ హీరోయిన్ గా పేరు దక్కించుకునేందుకు ఈ అమ్మడు తెలుగు నేర్చుకుంటుంది. తెలుగు హీరోయిన్స్ లో చాలా మందికి తెలుగు రాదు. రుహాని తెలుగు నేర్చుకునేందుకు సిద్దం అవ్వడం నిజంగా అభినందనీయం.