Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : హిట్ బ్యూటీ క్యూట్ స్టిల్
By: Tupaki Desk | 23 Sept 2020 9:15 AM ISTఅక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు దక్కించుకుంది. ఆ సినిమాలో ఎలాంటి స్కిన్ షో చేయకుండా రుహాని ఆకట్టుకుంది. ఈ అమ్మడికి తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చిలసౌ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా నటించి మళ్లీ మెప్పించింది. హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడి సోషల్ మీడియా పిక్స్ అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.
రుహాని శర్మకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా అయిదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిని ఎంటర్ టైన్ చేసేందుకు రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తక్కువ సమయంలోనే అయిదు లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో క్యూట్ గా ఉందనే ప్రశంసలు దక్కించుకుంది. ఎప్పుడు స్కిన్ షోకు ఇష్టపడని రుహాని శర్మ ఈసారి కూడా చాలా సింపుల్ లుక్ లో కనిపించి కళ్లు మూసుకుని ఏదో నవ్వుతూ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. కళ్లు మూసుకుని మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్నావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.