Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పాయె.. పక్కింటమ్మాయి ఇమేజ్ పాయె!

By:  Tupaki Desk   |   4 Sep 2019 8:15 AM GMT
ఫోటో స్టొరీ: పాయె.. పక్కింటమ్మాయి ఇమేజ్ పాయె!
X
టాలీవుడ్ లో ఉత్తరాది భామాలకు కశ్మీర్(ఏంటో.. 'కా..శ్మీర్' అని రాయాలనిపిస్తోంది) తివాచి పరిచి మరీ ఆవకాశాలు ఇస్తారు. ఒకరు ఫేడ్ అవుట్ అయ్యేలోపు మరొకరు రెడీగా ఉంటారు. ముంబైలో ఉండే ఈ కెరీర్ అడ్వైజర్లు కూడా భామలను దగ్గరుండి మరీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు దక్కుతాయి కానీ అందరికీ కాజల్.. తమన్నాల లాగా పాతుకుపోవడం కుదరదు. ప్రస్తుతం రుహాని శర్మ అలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది.

పంజాబీ కుడీ అయిన ఈ రుహాని సుశాంత్ 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటన విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్నా ఎందుకో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. 'చిలసౌ' లో గర్ల్ నెక్స్ట్ డోర్ టైపు పాత్ర పోషించడంతో గ్లామర్ కు స్కోప్ లేకుండా పోయింది. అందుకే రూటు మార్చాలని డిసైడ్ అయ్యి గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తోంది. ఎలాగూ సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి అక్కడ తన ప్రతాపం చూపిస్తోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ క్యాప్షన్ కు బదులుగా ఒక పువ్వు బొమ్మ ఎమోజి పెట్టింది. మరి దానర్థం ఏంటో.. అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత!

ఫోటో విషయానికి వస్తే షర్టు.. ప్యాంట్ ధరించింది. షర్టుకు బటన్లు పెట్టుకోకుండా సోకులను ఆరేసింది. తలకు కొప్పు కట్టి.. డీసెంట్ మేకప్ తో లిప్ స్టిక్ తో స్టైలిష్ గానే ఉంది. రుహాని హాటుగానే ఉంది కానీ ఫోటోలో ఒక డిఫెక్ట్ ఉంది. ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ రుహానిని ఫోకస్ చేసి సెంటర్ చేయకుండా రైట్ సైడ్ ఎక్కువ స్పేస్ వదిలాడు. అయినా నెటిజన్లకు ఆ స్పేసుతో పనేముంది.. స్పైసీ పోజుతోనే కదా పని. ఈ ఫోటోకు కామెంట్లు కూడా అదిరిపోయాయి . "రుహాని ఆన్ ఫైర్".. "హాట్ అండ్ స్పైసీ".. "సిజ్లింగ్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోలను ఫిలిం మేకర్లు ఎవరైనా చూస్తే ఈ హాటు అవతారానికి సార్థకత!