Begin typing your search above and press return to search.

అగ్గి రాజేస్తున్న అక్కినేని హీరోయిన్

By:  Tupaki Desk   |   9 Jun 2019 7:01 AM GMT
అగ్గి రాజేస్తున్న అక్కినేని హీరోయిన్
X
మిల్కీ వైట్ అందాలతో క్లీన్ బౌల్డ్ చేసిన త‌మ‌న్నా స్ఫూర్తితో ఎంద‌రో న‌వ‌త‌రం క‌థానాయిక‌లు గ్లామ‌ర్ ప్ర‌పంచంలో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మిల్కీని మించిన మిల్కీ బ్యూటీస్ ఎంద‌రు వ‌చ్చినా ఇక్క‌డ నిల‌దొక్కుకోవ‌డం ఏమంత సులువేం కాదు. ఇప్ప‌టికే బోలెడుమంది ముద్దుగుమ్మ‌లు టాలీవుడ్ లో తొలి అవ‌కాశం అందుకుని బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ వెళ్లిపోయారు. అయితే సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్ప‌టికీ ఇన్ స్టా- ట్విట్ట‌ర్ లో హాట్ ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటున్నారు. ఓ ర‌కంగా సోష‌ల్ మీడియా పోస్టుల‌తోనే అవ‌కాశాలు కొల్ల‌గొడుతున్న భామ‌లు.. కంబ్యాక్ అవుతున్న క‌థానాయిక‌లు ఉన్నార‌ని చెప్పొచ్చు.

తాజాగా చి.ల‌.సౌ ఫేం.. యంగ్ బ్యూటీ రుహానీ శ‌ర్మ సోషల్ మీడియాలో ట‌చ్ లోకొచ్చింది. ఈ భామ తాజా పోస్టింగ్ జోరుగా వైర‌ల్ అవుతోంది. రుహాని న‌టించిన తొలి సినిమా `చి.ల‌.సౌ` బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత పెద్ద స‌క్సెస్ సాధించ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. సుశాంత్ - రుహానీ జంట న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆ సినిమాలో సింపుల్ మిడిల్ క్లాస్ గాళ్ పాత్ర‌లో రుహానీ చ‌క్క‌ని అభిన‌యం క‌న‌బ‌రిచింది. అయినా ఎందుక‌నో ఈ అమ్మ‌డు రెండో అవ‌కాశం అందుకోవ‌డంలో మాత్రం త‌డ‌బ‌డుతోంది. చి.ల‌.సౌ రిలీజై ఇంత‌కాల‌మైనా ఇంకా తెలుగులో వేరొక సినిమాకి సంత‌కం చేయ‌లేదు. క‌నీసం ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో అయినా ఏ అవ‌కాశం అందుకుందో తెలీదు.

చి.ల‌.సౌ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్రన్ రెండో సినిమాతో బిజీ బిజీ. రాహుల్ ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా `మ‌న్మ‌ధుడు2` తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌నీసం ఈ చిత్రంలో అతిధి పాత్ర‌కు అయినా రుహానీ పేరును ప‌రిశీలించ‌లేదా? అన్న‌ది చూడాలి. అయితే రుహానీలో గ్రేసు- స్పీడు చూసైనా మునుముందు అక్కినేని కాంపౌండ్ పిలిచి అవ‌కాశాలిస్తుందేమో! అందానికి అందం .. వేడెక్కించే వ‌య్యారం ఈ భామ‌లో కొద‌వేమీ లేద‌ని తాజా పోస్ట్ చెప్ప‌క‌నే చెబుతోంది. మిల్కీ ప్ల‌స్ మిల్కీ స్క్వేర్ అన్న‌ట్టే చెల‌రేగుతోంది ఈ బ్యూటీ!