Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: గ్లామర్ గేట్లు తెరచిన రుహనీ

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:06 PM GMT
ఫోటో స్టొరీ: గ్లామర్ గేట్లు తెరచిన రుహనీ
X
ఎంత చెట్టుకు అంత గాలి. బ్యూటీలయినా హీరోయిన్లకు ఉండే ఇబ్బందులు హీరోయిన్లకు ఉంటాయి. ఒక్కసారి పక్కింటమ్మాయి ముద్ర పడితే ఇక పర్మనెంట్ గా అప్పలమ్మ.. నాంచారమ్మ రోల్స్ ఇచ్చేందుకు డైరెక్టర్లు - అలాంటి పాత్రలు రాసేందుకు రైటర్లు రెడీగా ఉంటారు. ఈ సంగతి త్వరగా పసిగట్టిందేమో 'చి ల సౌ' బ్యూటీ రుహాని శర్మ.. గ్లామర్ డ్యామ్ గేట్లు మెల్లగా ఒక్కటొక్కటిగా ఎత్తడం మొదలుపెట్టింది.

రీసెంట్ గా ఒక హాట్ ఫోటో షూట్ లో పాల్గొని తనలో ఉన్న ఖజురహో శిల్పాన్ని క్లీవేజ్ అందాలతో చూపిస్తూ చిన్న ఫస్ట్ లుక్ ఇచ్చింది. దీనర్థం ఒకటే.. 'నాకు అప్పలమ్మ క్యారెక్టర్లు వద్దు.. అల్ట్రా మోడరన్ రోల్స్ ఇవ్వండి.. నేను నా సత్తా చూపిస్తాను'. అసలేం పోజు అది.. పాలరాతి శిల్పం లా మెరిసిపోతూ సూపర్ స్మైల్ తో సెక్సీ బ్యూటీలా మారింది. ఇక ఇప్పటికీ మన మేకర్లు పట్టించుకోకపోతే కియారా అద్వాని లాగా 'లస్ట్ స్టోరీస్'.. అందులో వైబ్రేటర్- భావప్రాప్తి సీన్స్ తో గట్టి షాక్ ఇస్తుందేమో!

దాని సంగతేమో గానీ ఈ ఫోటో మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. కొంతమంది కుర్రకారు ఈ అందాలను చూసి తట్టుకోలేక లైకులతో షేర్లతో సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారట!