Begin typing your search above and press return to search.

మరో పరభాషా ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:00 AM GMT
మరో పరభాషా ముద్దుగుమ్మ
X
టాలీవుడ్ లోకి పక్క భాషల సుందరాంగులు తెగ వచ్చేస్తున్నారు. అసలు మన దగ్గర వెలిగిపోయేది వాళ్లే లెండి. లోకల్ భామలకు చాలా అరుదుగా అవకాశాలు వస్తుంటాయి. కాకపోతే ఈ మధ్య ఈ స్పీడ్ మహా జోరందుకుంది. కొత్తగా వచ్చిన సుందరాంగులు కూడా స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తున్నారు. ఇప్పుడు రుహానీ శర్మ అనే బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసేస్తోంది.

పంజాబీ మూవీస్ తో పాటు ప్రస్తుతం తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోంది రుహానీ శర్మ. ఈ ఐదున్నర అడుగుల బ్యూటీ సుశాంత్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తోంది. యాక్టర్ రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా తన కొత్త అవతారం చూపించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరగగా.. సుశాంత్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి రుహానీ శర్మను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసుకున్నారు. మూవీ లాంఛింగ్ సందర్భంగా ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగానే ప్రకటించింది.

ఓ తమిళ్ సినిమాలో రుహానీ శర్మను చూసిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. తను రూపొందించనున్న ఫ్రెష్ లవ్ స్టోరీలో.. సుశాంత్ పక్కన ఫ్రెష్ పెయిర్ గా కనిపించేందుకు ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని భావించాడట. వెంటనే ఆమెను సంప్రదించడం.. అగ్రిమెంట్స్ చేసుకోవడం పూర్తయిపోయాయి. సిరుని సిని కార్పొరేషన్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం..త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది.