Begin typing your search above and press return to search.

రుద్రమదేవి రధం రయ్.. రయ్..

By:  Tupaki Desk   |   16 Aug 2015 3:47 AM GMT
రుద్రమదేవి రధం రయ్.. రయ్..
X
చేసిన పని ఎంత గొప్పగా చేశామన్నది ఎంత ముఖ్యమో దాన్ని ప్రజలలోకి ఎంత బాగా తీసుకెళ్ళామన్నది కూడా అంతే ముఖ్యం. ఈ ప్రచారం టాలీవుడ్ కి సైతం అనాదిగా వస్తున్న ఆచారం. కొత్తకొత్త కాన్సెప్ట్ లతో పబ్లిసిటీలోకి వెళ్ళేవారికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. బాహుబలి సినిమా ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో వుంటే మిగిలిన చిత్రాలు వాటిని అనుసరిస్తున్నాయి.

బాహుబలి ముందు వరకూ డల్ గా నడిచిన బాక్స్ ఆఫీసు ఇప్పుడు వరస హిట్ సినిమాలతో కళకళలాడిపోతోంది. ప్రభాస్ తరువాత వచ్చిన మహేష్ ఈ కళను రెట్టింపు చేస్తూ నూతనోత్సాహాన్ని రగిలించాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు రుద్రమదేవి టీమ్ కూడా తమ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. సెప్టెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా పబ్లిసిటీ మెటీరియల్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఓరుగల్లు చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం కావడంతో స్కూల్స్, కాలేజీల లోనూ ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు. దీనితో పాటే 'రుధ్రమ్మ రథం' అంటూ ఒక వెహికిల్ ని రెడీ చేశారు. ఈ వాహనాన్ని ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శిస్తూ చిత్ర ప్రచారానికి ఉపయోగించనున్నారు. ఈ టైప్ ప్రచారం గతంలో సిద్ధార్ధ్ - శృతిహాసన్ ల అనగనగా ఓ ధీరుడు సినిమాకు కూడా చేశారు. అయితే అది ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. మరి ఈ రుద్రమ్మ రధం ఏం చేస్తుందో చూడాలి.