Begin typing your search above and press return to search.

గుణా.. మెగా ఫ్యామిలీ తో ఫిక్సింగ్‌

By:  Tupaki Desk   |   31 Aug 2015 10:20 AM IST
గుణా.. మెగా ఫ్యామిలీ తో ఫిక్సింగ్‌
X
దేశంలోనే తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి సినిమా 'రుద్రమదేవి'. అనుష్క, రానా, అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌ కి వస్తోంది. సెప్టెంబర్‌ లో రిలీజ్‌ ఉంటుంది అని ప్రకటించారు కానీ, మరోసారి అక్టోబర్‌ కి వాయిదా వేశారు. లేటెస్ట్‌ సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 9 రిలీజ్‌ తేదీ అని తెలుస్తోంది. అయితే అదే నెల 12/16న చరణ్‌- శ్రీనువైట్ల కాంబినేషన్‌ లోని క్రేజీ ప్రాజెక్ట్‌ 'బ్రూస్లీ' రిలీజవుతోంది. ఒకవేళ ఇలా జరిగితే రుద్రమదేవి కలెక్షన్ల మాటేమిటి? కేవలం రెండు పెద్ద సినిమాల మధ్య కేవలం వారం గ్యాప్‌ అంటే ఆ మేరకు కలెక్షన్లపై ప్రభావం పడినట్టే కదా!

అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది. గుణశేఖర్‌ కి ఇప్పటికే మెగా ఫ్యామిలీ సూచన ప్రాయంగా పోటీ బరిలో ఉండమని చెప్పి ఉంటుందా? అన్న సందేహాలొస్తున్నాయి. బ్రూస్లీ అక్టోబర్‌ లో రాలేకపోవచ్చు. కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని హింట్‌ ఇచ్చి ఉంటారు. అందుకే గుణా డేర్‌ గా రంగంలోకి దిగేస్తున్నాడు. రుద్రమదేవి అక్టోబర్‌ లో రిలీజైతే దసరా సెలవులు కలిసొస్తాయి కాబట్టి స్కూల్‌, కాలేజీ పిల్లలంతా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వచ్చే ఛాన్సుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్‌ మిస్‌ చేయడనే అనుకుటున్నారంతా. మెగా అండతో గుణశేఖర్‌ ఇది సాధించుకున్నట్టే కనిపిస్తున్నాడు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.