Begin typing your search above and press return to search.
రుద్రమదేవి సెన్సార్ కథలో కీలక మలుపు
By: Tupaki Desk | 24 Sept 2015 11:03 AM ISTరుద్రమదేవి సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘బాహుబలి’ కంటే ముందే విడుదల చేయాలన్న తలంపుతో జులై 10కి రెండు వారాల ముందు జూన్ 26న ‘రుద్రమదేవి’ విడుదలకు గుణశేఖర్ ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ తేదీకి పది రోజుల ముందు కూడా సినిమా విడుదల ఖాయమనే అనుకున్నారంతా. కానీ సడెన్ గా వాయిదా పడిపోయింది. చాలా మందికి తెలియని సంగతేంటంటే.. అప్పటికి రుద్రమదేవి సెన్సార్ కూడా అయిపోయింది. క్లీన్ యు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు సెన్సార్ వాళ్లు. కానీ సినిమా విడుదల కాలేదు.
కానీ ఇప్పుడు మరోసారి ‘రుద్రమదేవి’ సెన్సార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. మరి అప్పటికి ఇప్పటికి ఏం మారిందన్నది ఆసక్తికరం. ఐతే కొంచెం గ్లామర్ డోస్ పెంచడమే సర్టిఫికెట్ మారడానికి కారణమని సమాచారం. కేథరిన్ థ్రెసాతో పాటు అనుష్క నటించిన కొన్ని సరస సన్నివేశాల్ని ముందు సినిమాలో కలపలేదట. ఐతే ఇప్పుడు వాటిని చేర్చి ‘రుద్రమదేవి’ని రంజుగా మార్చాడట గుణశేఖర్. సినిమాను హిట్ చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులకునే ఉద్దేశం లేకే.. ఆ సన్నివేశాల్ని జోడించినట్లు చెబుతున్నారు. అందుకే మరోసారి సెన్సార్ కు పంపడం.. వాళ్లు సర్టిఫికెట్ మార్చడం జరిగిందని సమాచారం. ఏదైతేనేం.. ఇంకో రెండు వారాల్లో విడుదలకు సిద్ధమవుతోంది ‘రుద్రమదేవి’. గుణశేఖర్ ప్రాణం పెట్టి చేసిన సినిమా అతడికి మంచి ఫలితాన్నివ్వాలని ఆశిద్దాం.