Begin typing your search above and press return to search.

‘బ్రూస్ లీ’ని కొట్టేసిన రుద్రమదేవి

By:  Tupaki Desk   |   17 Oct 2015 6:39 AM GMT
‘బ్రూస్ లీ’ని కొట్టేసిన రుద్రమదేవి
X
వారం కిందట వచ్చిన రుద్రమదేవి.. ఈ శుక్రవారం విడులైన ‘బ్రూస్ లీ’ని కొట్టేయడమేంటి.. అనుకుంటున్నారా? ఈ వ్యాఖ్య తెలుగు వెర్షన్ల గురించి కాదు. తమిళంలో ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాలకు వస్తున్న టాక్ గురించి. రుద్రమదేవి తమిళంలో వారం లేటుగా ఈ శుక్రవారమే విడుదలైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా మాత్రం తెలుగుతో పాటే.. తమిళంలోనూ ఒకే రోజు విడుదలైంది. దీంతో రెండు తెలుగు డబ్బింగ్ సినిమాల మధ్య తమిళనాట రసవత్తర పోరు నెలకొంది. ఐతే ఈ పోటీలో ‘రుద్రమదేవి’దే పైచేయి అయింది. హైప్ తో పాటు ఓపెనింగ్స్ కూడా ‘రుద్రమదేవి’కే ఎక్కువ.

‘బాహుబలి’లో నటించిన రానా, అనుష్క ఈ సినిమాలో ఉండటం.. వాళ్లిద్దరికీ ఇప్పటికే తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉండటం.. బాహుబలి లాగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ‘రుద్రమదేవి’కి తమిళనాట మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా టాక్ కూడా బాగానే ఉందక్కడ. ఐతే రామ్ చరణ్ కు తమిళంలో పెద్దగా క్రేజ్ లేదు. పైగా ‘బ్రూస్ లీ’ సినిమా కూడా రొటీన్ కావడంతో అక్కడి జనాలు పెదవి విరిచేశారు. మీడియా ఈ సినిమానసలు పట్టించుకోలేదు. రివ్యూలు కూడా పెద్దగా లేవు. ఉన్నవి కూడా నెగెటివ్ గానే ఉన్నాయి. సంపత్ రాజ్ - అరుణ్ విజయ్ - నదియా లాంటి వాళ్లున్నా ఆ క్యారెక్టర్లు తమిళ జనాలకు పెద్దగా కనెక్టవలేదు. దీంతో రచ్చ - గోవిందుడు అందరివాడేలే - ఎవడు డబ్బింగ్ సినిమాల్లాగే ‘బ్రూస్ లీ’ సైతం నామమాత్రం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.