Begin typing your search above and press return to search.

ఇక్కడ రూ.200 కోట్లు.. అక్కడ రూ.100 కోట్లు

By:  Tupaki Desk   |   15 Nov 2021 3:45 AM GMT
ఇక్కడ రూ.200 కోట్లు.. అక్కడ రూ.100 కోట్లు
X
గత ఏడాది మార్చి నుండి బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ సౌత్ లో అయినా ఏతా వాతా సినిమాలు విడుదల అయ్యాయి. కాని బాలీవుడ్ లో మాత్రం సినిమాలు థియేటర్ రిలీజ్ కు నోచుకోలేదు. దాదాపుగా 20 నెలల తర్వాత బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మొదటి వేవ్ మరియు సెండ్ వేవ్ సమయంలో బాలీవుడ్‌ ప్రేక్షకులు ఓటీటీని ఆశ్రయించిన విషయం తెల్సిందే. మళ్లీ జనాలు థియేటర్లకు వస్తారా లేదా అనే అనుమానంతోనే సినిమాల విడుదల మొదలు అయ్యింది. ఇలాంటి సమంలో అనూహ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటిలాగే వందల కోట్ల వసూళ్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్స్ అక్షయ్ కుమార్.. అజయ్ దేవగన్‌.. రణవీర్ సింగ్ లు నటించిన సూపర్ యాక్షన్‌ మూవీ సూర్యవంశీ ఇటీవలే విడుదల అయ్యింది. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్లతో దూసుకు పోతుంది. వంద కోట్లు రాబడితే గొప్ప విషయంగా అంతా అనుకున్నారు. కాని ఈ సినిమా 200 కోట్లకు చేరువ అయ్యింది. ఏ క్షణంలో అయినా సినిమా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను చేరుకోవడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద దాదాపు రెండేళ్ల తర్వాత 200 కోట్లు దక్కించుకున్న సినిమాగా సూర్య వంశీ అరుదైన రికార్డును దక్కించుకుంది. బాలీవుడ్‌ పెద్ద సినిమాలకు ఆశలు కలిగిస్తూ థియేటర్లకు ఇంకా జనాలు వస్తారనే నమ్మకంను కలిగించిన సూర్యవంశీ మరో వైపు ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా సిద్దం అవుతోంది. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను విడుదల అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకుని రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట. సినిమా వసూళ్ల జాతర కొనసాగుతూనే ఉన్న సమయంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు అయ్యేలా కనిపిస్తుంది. స్ట్రీమింగ్ మొదలు అయ్యే సమయంకు ఖచ్చితంగా రెండు వందల కోట్ల రూపాయల మార్క్ ను చేరడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల చెబుతున్నారు. ఇదే సమయంలో సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో కూడా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున చూసే అవకాశాలు ఉన్నాయి.

ఒకే సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లు మరియు ఓటీటీ బిజినెస్ ను 100 కోట్లు చేయడం మామూలు విషయం కాదు. ఇంతటి బిజినెస్ ఈమద్య కాలంలో ఏ ఒక్క బాలీవుడ్ సినిమా కూడా చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అద్బుతమైన అవకాశం ఈ సినిమాకే దక్కింది అంటూ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ కు చెందిన ముగ్గురు స్టార్ హీరోలు నటించడం.. అది కూడా భారీ యాక్షన్‌ మూవీ గా రూపొందడం వంటి కారణాల వల్ల సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అలాగే భారీ ఓటీటీ బిజినెస్ చేసింది. పోస్ట్‌ థియేట్రికల్‌ రైట్స్ వంద కోట్లు అంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఈ అరుదైన ఘనత దక్కించుకోలేదు. ఇలాంటి బిజినెస్ లు హాలీవుడ్‌ లోనే జరిగాయి. ముందు ముందు ఇలాంటి వందల కోట్ల ఓటీటీ డీల్స్ మరియు వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ మళ్లీ మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.