Begin typing your search above and press return to search.

రూ.100 కోట్ల సినిమా పది కోట్లకు పరిమితం

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:12 AM GMT
రూ.100 కోట్ల సినిమా పది కోట్లకు పరిమితం
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సూపర్ స్టార్‌ అనడంలో సందేహం లేదు. కరోనా ముందు వరకు ఆయన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన నటించగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. బాలీవుడ్ లో అక్షయ్‌ కుమార్ సినిమా అంటే వంద కోట్ల వసూళ్లు ఖాయం అన్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి కొనసాగుతుంది. అలాంటి అక్షయ్ కుమార్ మూవీ కనీసం పది కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది. ఈ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతుంది అనడంలో సందేహం లేదు.

అక్షయ్ కుమార్‌ నటించిన బెల్‌ బాటమ్‌ కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు ఏమైతే అదే అయ్యింది అన్నట్లుగా విడుదల చేశారు. మినిమంగా అయినా వసూళ్లు వస్తాయనుకున్నారు. వందల కోట్లు కాకున్నా కనీసం వంద కోట్లు అయినా వస్తాయనుకుంటే కనీసం పాతిక కోట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బెల్‌ బాటమ్‌ సినిమా ఇప్పటి వరకు కనీసం పది కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయిందట. సాదారణంగా అయితే వీకెండ్‌ వరకు వంద కోట్లకు మించి వసూళ్లను దక్కించుకునే అక్షయ్‌ కుమార్‌ నాలుగు రోజులు దాటినా కూడా కనీసం పది కోట్లను కూడా రాబట్టలేక పోయాడు అనేది టాక్‌.

లాంగ్ రన్ లో బెల్‌ బాటమ్‌ సినిమా కనీసం 15 నుండి 20 కోట్ల వరకు కూడా రాబడుతుందా అనేది అనుమానంగా ఉంది. ఈ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేసి ఉంటే నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చేవి. కాని ఇంతకు ముందే అక్షయ్‌ కుమార్‌ సినిమాలు ఓటీటీ లో రావడం వల్ల ఈ సినిమాను అయినా థియేటర్‌ రిలీజ్ కు సిద్దం చేయాలని భావించారు. అందుకే రిస్క్ అయినా కూడా థియేటర్‌ రిలీజ్ కు వచ్చారు. కాని ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. అందుకే వంద కోట్ల సినిమా కాస్త కనీసం పది కోట్లకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాలీవుడ్‌ లో పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.