Begin typing your search above and press return to search.
టామ్ క్రూజ్ తో RRR రైటర్
By: Tupaki Desk | 15 Feb 2023 12:26 PMఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తం అయ్యిందని చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి మేకింగ్, స్టొరీ నేరేషన్ పై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ప్రాంతీయ చిత్రంగా ఇండియాలో సెలబ్రిటీ మెప్పు పొందడమే ఎక్కువ అనుకుంటే ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి హాలీవుడ్ లెజెండరీ దర్శకులు అయిన జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి వారి ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు.
సినిమాని హై ఎండ్ కి తీసుకెళ్ళి ఆవిష్కరించిన అలాంటి గొప్ప దర్శకులు రాజమౌళి స్టొరీ నేరేషన్ షేక్స్ పియర్ కథల తరహాలో ఉందని చెప్పడం నిజంగా గొప్ప అభినందన అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. ఇక ఈ పాటని రాసిన రచయిత చంద్రబోస్ నిజంగా ఇండియన్ ఇండస్ట్రీలో మరి ఏ ఇతర పాటల రచయితకి రాని గౌరవాన్ని అందుకున్నారు. ఈ ఆనందాన్ని అతను ఆశ్వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ కి నాటు నాటు సాంగ్స్ ఇప్పుడు వెళ్ళింది. తాజాగా ఆస్కార్ నామినేషన్ టీమ్ లంచ్ ఈవెంట్ జరిగింది. దీనికి ఆర్ఆర్ఆర్ నుంచి ఎంఎం కీరవాణి, చంద్రబోస్ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా చంద్రబోస్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఈవెంట్ సందర్భంగా టామ్ క్రూజ్ తో కొద్దిసేపు చర్చించినట్లు టాక్.
అలాగే దర్శకుడు స్పిల్ బర్గ్ ని కూడా కలుసుకొని మాట్లాడారని టాక్. ఇక ప్రస్తుతం స్పిల్ బర్గ్ తెరకెక్కించిన సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. మొత్తానికి ఈ ఫోటోలతో తన సంతోషాన్ని చంద్రబోస్ పంచుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు అందరూ కూడా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. అలాగే కచ్చితంగా వస్తుందనే మాట కూడా వినిపిస్తుంది.