Begin typing your search above and press return to search.

భారీ బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలో దిగుతున్న 'ఆర్.ఆర్.ఆర్'

By:  Tupaki Desk   |   1 April 2021 11:11 PM IST
భారీ బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలో దిగుతున్న ఆర్.ఆర్.ఆర్
X
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు తోడుగా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై అన్ని భాషల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని రేంజ్‌ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్ని కూడా క్లోజ్ అయినట్లు సమాచారం.

దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తమిళ థియేట్రికల్ హక్కులు కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. అలానే కర్ణాటకలో ఏషియన్ మరియు వారాహి సంస్థలు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్తూడియోస్ వారు కొనుకోలు చేశారు. అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్-డిజిటల్-శాటిలైట్ హక్కులను కూడా పెన్ స్టూడియోస్ వాళ్లే దక్కించుకున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 750 కోట్ల వరకు జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని సుమారు 450కోట్లతో నిర్మిస్తున్నారు. 'ట్రిపుల్ ఆర్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ 500 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి 2' సినిమా ఇండియాలోనే అత్యధిక వసూళ్ళు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా హిట్ అయితే టాలీవుడ్ మార్కెట్ ను మరో స్థాయికి వెళ్లనుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.