Begin typing your search above and press return to search.

RRR వ‌ర్సెస్ భుజ్.. ఊరక రారు మహానుభావులు..!

By:  Tupaki Desk   |   20 Nov 2020 10:30 AM IST
RRR వ‌ర్సెస్ భుజ్.. ఊరక రారు మహానుభావులు..!
X
కోవిడ్ రిలీఫ్ ఇవ్వ‌క‌పోయినా.. భ‌యం త‌గ్గింది. ఇప్ప‌టికే అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నులు ఊపందుకున్నాయి. వినోద ప‌రిశ్ర‌మ‌కు కాస్త ఊర‌ట ల‌భించినట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి షూటింగులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇందులో భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్ర‌భుత్వాలు రూల్స్ స‌డ‌లించ‌డంతో ఆన్ లొకేష‌న్ షూటింగుల‌తో స్టార్లు బిజీ బిజీగా ఉన్నారు.

ఊరక రారు మహానుభావులు..! ఎరుగ‌క రారు ప్ర‌వ‌రాఖ్యులు!! అన్న చందంగా బాలీవుడ్ యాక్ష‌న్ గ‌న్ అజ‌య్ దేవ‌గ‌ణ్ నేరుగా హైద‌రాబాద్ లో దిగిపోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఇప్పుడు దేనికోసం వ‌చ్చారు? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

రాజమౌలి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ఆర్‌.ఆర్.‌ఆర్ ‌కోస‌మే విచ్చేశారా?

అజయ్ ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌.ఆర్.‌ఆర్ ‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశారు. హైదరాబాద్ కు తిరిగి రావడానికి కార‌ణం... రాబోయే షెడ్యూల్లో తన మొత్తం భాగాన్ని పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడని ఊహాగానాలకు ఇది దారితీసింది.

మరోవైపు అజయ్ తన త‌దుప‌రి బాలీవుడ్ చిత్రం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` కోసం షూటింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే అమితాబ్ బచ్చన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రానికి తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్నాడు. `మే డే` టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కోసం లొకేషన్ రీసెర్చ్ ‌లో భాగంగా ఇలా వ‌చ్చాడ‌ని ప‌లువురు భావిస్తున్నారు.