Begin typing your search above and press return to search.

నెట్టింట 'ఆర్ ఆర్ ఆర్‌' టీమ్ ట్వీట్ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 6:31 AM GMT
నెట్టింట ఆర్ ఆర్ ఆర్‌ టీమ్ ట్వీట్ వైర‌ల్‌
X
దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మొట్ట‌మొద‌టి స్థానంలో నిలిచిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రమిది. అంతే కాకుండా `బాహుబ‌లి` వంటి లార్జ‌ర్ దెన్ లైఫ్ మూవీ త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. జ‌న‌వ‌రి 7న భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ముందు ప్లాన్ చేశారు.

దీంతో వారం ముందుగానే సంక్రాంతి రాబోతోంద‌ని, ఈ మూవీతో సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ ని ఓ రేంజ్ లో చేసుకోవాల‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు భారీగా ప్లాన్స్ చేసుకున్నారు కానీ కోవిడ్‌, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సినిమా రిలీజ్ అంత మంచిది కాద‌ని భావించిన మేక‌ర్స్ `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చారు. దీంతో ఊహించ‌ని వార్త `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ నుంచి రావ‌డంతో ప్రేక్ష‌కులు కొంత నిరుత్సాహానికి గుర‌య్యారు.

అయితే తాజాగా వైర‌స్ అదుపులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌రిస్థితులు అనుకూలంగా మారుతున్నాయ‌ని గ‌మ‌నించిన `ఆర్ ఆర్ ఆర్` మేక‌ర్స్ ఈ మూవీని మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీంతో అభిమానుల్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. కోరుకున్న సినిమా.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఖ‌చ్చితంగా మార్చి 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అయింద‌ని తెలియ‌డంతో ప్రేక్ష‌కుల్లోనూ నూత‌నొత్సాహం క‌నిపిస్తోంది.

ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ టాజాగా ఆన్ లొకేష‌న్ కి సంబంధించిన ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసింది. సినిమాలోని కీల‌క ఘ‌ట్టంలో హీరోలు రామ్ చ‌ర‌ణ్ హార్స్ పై ఎన్టీఆర్ మోట‌ర్ సైకిల్ పై క‌ద‌నోత్సాహంతో క‌దులుతున్న సంద‌ర్భానికి సంబంధించిన ఫొటో ఇది. ఈ ఫొటోకి ఓ అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేశారు.

మ‌రో 50 రోజుల్లో సినిమా థియేట‌ర్ల‌లో రేసింగ్ ప్రారంభం కాబోతోంది. (#RRRMovie FireWater wave) `ఆర్ ఆర్ ఆర్` మూవీ ఫైర్‌.. జ‌ల ప్ర‌వాహం` అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మార్చి 25న మేము మిమ్మ‌ల్ని చూస్తాం` అంటూ గుర్రం, మోట‌ర్ సైకిల్ సింబ‌ల్స్ ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.