Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ టెన్షన్‌ తగ్గింది

By:  Tupaki Desk   |   15 May 2020 7:39 AM GMT
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ టెన్షన్‌ తగ్గింది
X

నందమూరి ఫ్యాన్స్‌ గత రెండు వారాలుగా ఉందా లేదా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి భీమ్‌ వీడియో ఉందంటూ నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చాడు. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ అయినా కూడా వీడియో మేకింగ్‌ విషయంలో ఇబ్బంది ఉందని.. చరణ్‌ వీడియో మాదిరిగా ఎన్టీఆర్‌ వీడియో రాకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ నిర్మాత దానయ్య ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ తో భీమ్‌ ఫర్‌ రామరాజు అంటూ ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు కూడా అలాగే వస్తుందని అంతా ఆశించారు. కాని లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగక పోవడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మేకర్స్‌ ఎన్టీఆర్‌ విడియోను విడుదల చేయడం కష్టమే అనుకున్నా కూడా జక్కన్న ఎట్టి పరిస్థితుల్లో భీమ్‌ వీడియో విడుదల చేయాలనే పట్టుదలతో ఇప్పటికే ఆ వీడియోను రెడీ చేయించే పనిలో ఉన్నాడు.

ఎన్టీఆర్‌ భీమ్‌ వీడియోపై క్లారిటీ వచ్చింది. అయితే అది ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్‌ గా ఎంది. భీమ్‌ ఫర్‌ రామరాజు అంటూ ఎన్టీఆర్‌ చాలా పవర్‌ ఫుల్‌ వాయిస్‌ ఓవర్‌ తో డైలాగ్‌ చెప్పి రామరాజు పాత్రను పరిచయం చేశాడు. ఇప్పుడు కొమురం భీమ్‌ వీడియోను కూడా అలాగే చేస్తారా లేదంటే మరో రకంగా ఏమైనా జక్కన్న ప్లాన్‌ చేశాడా అనేది చూడాలి.