Begin typing your search above and press return to search.

బాహుబలి 2 రికార్డ్‌ బ్రేక్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ టార్గెట్‌

By:  Tupaki Desk   |   12 Feb 2020 4:30 AM GMT
బాహుబలి 2 రికార్డ్‌ బ్రేక్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ టార్గెట్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏ సౌత్‌ సినిమా ఈ మద్య కాలంలో బ్రేక్‌ చేయలేని విధంగా ‘బాహుబలి 2’ సినిమా వసూళ్లను తీసుకు వెళ్లి పెట్టాడు. దాదాపు 1800 కోట్ల రూపాయలను బాహుబలి 2 చిత్రం రాబట్టిన విషయం తెల్సిందే. సౌత్‌ సినిమాలే కాదు బాలీవుడ్‌ సినిమాలు సైతం ఆ స్థాయి వసూళ్లను దక్కించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. ఇప్పట్లో ఏ ఇండియన్‌ సినిమా ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం కనిపించడం లేదు.

బాహుబలి 2 చిత్రం రికార్డును ఇప్పుడు జక్కన్న తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కూడా బ్రేక్‌ చేస్తుందనే నమ్మకం లేదు. కాని బాహుబలి 2 చిత్రం సాధించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రికార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో బ్రేక్‌ చేయాలని జక్కన్న అండ్‌ టీం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రీలీజ్‌ బిజినెస్‌ దాదాపుగా 500 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

నైజాం.. ఆంధ్రా.. కర్ణాటక.. ఓవర్సీస్‌ బిజినెస్‌ ల విషయంలో బాహుబలి 2 ను ఆర్‌ఆర్‌ఆర్‌ క్రాస్‌ చేయడం దాదాపుగా ఖాయం అని తేలిపోయింది. వసూళ్ల విషయం ఎలా ఉన్నా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ విషయంలో తన రికార్డును తానే తిరగరాసుకోబోతున్నాడు జక్కన్న. కలెక్షన్స్‌ కూడా వెయ్యి కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజం అయితే జక్కన్నకు ఇండియన్‌ సినీ చరిత్రలో తిరుగులేని అరుదైన మరో రికార్డ్‌ సొంతం అవ్వడం ఖాయం.