Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   28 May 2020 7:10 AM GMT
ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్...?
X
దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.

కాగా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతోందట. దీని కోసం ఇప్పటికే కీరవాణి ఒక సాంగ్ కూడా రెడీ చేశాడట. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేయాలని ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్లాన్ చేస్తోందట. అయితే ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ భామగా ఎవరు స్టెప్పులు వేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. దీనికోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారట. ఈ ఐటమ్ సాంగ్ కి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. అయితే రకుల్ ఈ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఆర్.ఆర్.ఆర్ లో ఒక హీరో అయిన రామ్ చరణ్ అని అనుకుంటున్నారు. చరణ్ - రకుల్ ఇంతకముందు 'ధృవ' 'బ్రూస్లీ' సినిమాల్లో కలిసి యాక్ట్ చేసారు. ఈ పరిచయంతో చరణ్ ఈ సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడట. అందుకే అమ్మడు ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. ఇదే కనుక నిజమైతే స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. నిజానికి 'మన్మథుడు 2' సినిమా తర్వాత రకుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయని చెప్పవచ్చు. ఇతర ఇండస్ట్రీలలో ఆఫర్స్ వస్తున్నా తెలుగులో మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక గీతంలో నర్తించడానికి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.