Begin typing your search above and press return to search.

ప్ర‌తీచోటా ఎన్టీఆర్ నే ముందుకు నెడుతున్నారా?

By:  Tupaki Desk   |   22 March 2022 5:30 PM GMT
ప్ర‌తీచోటా ఎన్టీఆర్ నే ముందుకు నెడుతున్నారా?
X
ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ రాజ‌మౌళి ప్ర‌మోష‌న్స్ ని మ‌రింత స్పీడ‌ప్ చేస్తున్నాడు. `బాహుబ‌లి` సినిమాతో ఓ భారీ చిత్రానికి ఏ స్థాయిలో.. ఎలా ప్ర‌చారం చేయ‌వ‌చ్చో నిరూపించి విస్మ‌య‌ప‌రిచిన రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ కు అంత‌కు మించిన ప్యూహంతో ప్ర‌మోష‌న్స్ ని రూపొందించారు. దేశ వ్యాప్తంగా ప్ర‌మోష‌న్స్ కోసం ప‌ర్య‌టిస్తున్న రాజ‌మౌళి సినిమాపై హైప్ ని జ‌న‌రేట్ చేయ‌డంలో నూటికి నూరు శాతం విజ‌యం సాధించారు. గ‌త కొన్ని రోజులుగా రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తూ ట్రిపుల్ ఆర్ ని ప్ర‌మోట్ చేస్తున్నారు.

అయితే ఇలా వెళ్లిన ప్ర‌తీ చోట రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్..తాము వెన‌కుండి ఎన్టీఆర్ ని ముందుకు నెడుతున్నార‌ట‌. కార‌ణం ఎన్టీఆర్ స్థాయిలో వీరిద్ద‌రికి హిందీపై ప‌ట్ట‌లేక‌పోవ‌డ‌మేన‌ట‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీటాలెంటెడ్‌. ఆయ‌న హైద‌రాబాద్ లో పుట్టారు. ఇక్క‌డే పెరిగారు. దాంతో ఈయ‌న‌కు హిందీ పై మంచి ప‌ట్టు ఏర్ప‌డింది. అయితే అందులో హైద‌రాబాద్ స్లాంగ్ క‌నిపించ‌దు. ప‌క్క ఉత్త‌రాది వ్య‌క్తిలా ఎన్టీఆర్ హిందీ వుంటుంది. అది గ‌మ‌నించిన రాజ‌మౌళి తాము వెళ్లిన ప్ర‌తీ చోట ఎన్టీఆర్ ని ముందు నిల‌బెట్టి త‌న‌తో మాట్లాడిస్తున్నార‌ట‌.

రాజ‌మౌళి, రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ అమృత్ స‌ర్ లోని గోల్డెన్ టెంపుల్ ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మీడియా తో ఎన్టీఆర్ మాట్లాడారు. ఆయ‌న హిందీలో మాట్లాడుతుంటే అక్క‌డి మీడియా వారు అటెన్ష‌న్ తో విన‌డం విశేషం. త‌ను మాట్లాడిన స్పీచ్ లో ఏ ఒక్క త‌ప్పు కానీ త‌డ‌బాటు కానీ క‌నిపించ‌క‌పోగా చాలా కాన్ఫిడెంట్ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. చాలా స్పూత్ గా ఎన్టీఆర్ మీడియా తో మాట్లాడిన తీరుకు టాలీవుడ్ బిగ్గీస్ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అమృత్ స‌ర్ ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది, ఎన్టీఆర్ హిందీతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ అన‌ర్గ‌లంగా మాట్లాడ‌గ‌ల‌రు. అంద‌కే రాజ‌మౌళి ఎన్టీఆర్ ని ముందు వ‌రుస‌లో వుంచి తాను, రామ్ చ‌ర‌ణ్ వెన‌కాల వుంటున్నార‌ట‌. తాజా వీడియో చూసిన అభిమానులు `టీమ్ లో క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ బాగున్న వాడినే ఎప్పుడూ ఫ్రంట్ లో పెట్టిన‌ట్టు ప్ర‌తి స్టేట్ లో మీడియా ముందు తార‌క్ ని పెడుతున్నార‌ని ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.

ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ ని స్వ‌యంగా ఎన్టీఆర్ చెప్ప‌డం విశేషం. డైలాగ్ డిక్ష‌న్ లోనూ ఎలాంటి త‌డ‌బాటు క‌నిపించ‌లేద‌ని, ప‌ర్ ఫెక్ట్ గా స్లాంగ్ ని ఫాలోఅయ్యాడ‌ని ఫ‌స్ట్ కాపీ చూసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.