Begin typing your search above and press return to search.
'పాన్ ఇండియా' అంటే నచ్చదు.. 'RRR' బిగ్ స్క్రీన్ పైనే చూడాలి: ఎన్టీఆర్
By: Tupaki Desk | 13 May 2021 9:00 PM ISTఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఓ ఆన్ లైన్ మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
'ఆర్.ఆర్.ఆర్ పనులు 2018 నవంబర్ లోనే మొదలయ్యాయి. రాజమౌళి గురించి తెలిసిందే కదా. పర్ఫెక్ట్ గా లేకుంటే అసలే ఏదీ ఒప్పుకోరు. అందుకే తన సినిమాకు చాలా సమయం తీసుకుంటారు. ఇప్పటికే 19 నెలల పాటు ట్రిపుల్ ఆర్ షూటింగ్ చేశాం. దాదాపు మెజార్టీ భాగం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వల్ల వాయిదా పడింది. అక్టోబర్ లో రావడానికి ఇప్పటికే అవకాశం ఉంది' అని ఎన్టీఆర్ చెప్పారు.
''RRR చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఎప్పుడూ రాలేదు. 'బాహుబలి' 'జురాసిక్ పార్క్' 'అవెంజర్స్' వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా? ఇది కూడా అంతే. కొన్ని సినిమాలను థియేర్లలలోనే చూడాలి. ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశం లేదు. బిగ్ స్క్రీన్ పై అందరూ కలసి చూస్తూ ఆస్వాదించే సినిమా ఇది. సినిమా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తాం. మన ప్రేక్షకులకు సినిమా అంటే ప్రాణం. వాళ్లు సినిమాలు చూడటానికి థియేటర్ కు వస్తారనే నమ్మకం మాకు ఉంది'' అని తారక్ అన్నారు.
''అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ లు రియల్ లైఫ్ హీరోలు. మేం పెరుగుతూ వాళ్ల గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు సినిమా కోసం వారి జీవితాల గురించి మరింతగా తెలుసుకోవాల్సి వచ్చింది. వాళ్లు సాధించిన విజయాల గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చూపించడమే మా పని. అందుకోసం టీమ్ అంతా పెద్ద ఎత్తున కసరత్తులు చేశారు. నేను, చరణ్ దీని కోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది'' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఇంకా తారక్ మాట్లాడుతూ.. ''రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ పేర్లలోని లెటర్స్ తో RRR వర్కింట్ టైటిల్ గా పెట్టుకున్నాం. అయితే ఆ పేరు జనాల్లోకి బాగా వెళ్లడంతో ఆ పేరుతోనే 'రౌద్రం రణం రుధిరం' అని అర్థం వచ్చేలా రాజమౌళి టైటిల్ ఖరారు చేశారు''. 'పాన్ ఇండియా' సినిమా గురించి మాట్లాడుతూ.. ''పాన్ ఇండియా అనే పదం అంటే నాకు నచ్చదు. పాన్ అంటే వంట పాత్ర గుర్తుకొస్తుంది. ఒక మంచి సినిమాను దేశంలో ఉన్న అనేక భాషల్లో చూపించడమే మా ఉద్దేశ్యం'' అని పేర్కొన్నారు.