Begin typing your search above and press return to search.

దసరా తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్‌' సందడి షురూ

By:  Tupaki Desk   |   5 Sept 2020 4:00 PM IST
దసరా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సందడి షురూ
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటి వరకు ముగియాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమా చివరి దశలో ఆగిపోయింది. ఆరు నెలలుగా షూటింగ్స్‌ జరుగక పోవడంతో సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని కూడా మర్చకున్నట్లుగా తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ సఢలించి షూటింగ్స్‌ కు అనుమతించిన వెంటనే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ ను పునః ప్రారంభించాలని భావించాడు. అందుకోసం టెస్ట్‌ షూట్‌ ను కూడా ప్లాన్‌ చేశాడు.

రెండు రోజుల్లో టెస్ట్‌ షూట్‌ అనగా అది క్యాన్సిల్‌ అయ్యింది. ఆ సమయంలోనే కరోనా కేసులు వందల నుండి వేలకు పెరిగి పోయాయి. కరోనా కేసులు పెరిగిన సమయంలో రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. వారు కరోనాను జయించారు. ఇక కరోనా ప్రభావం తగ్గకున్నా కూడా షూటింగ్స్‌ మొదలవుతున్నాయి. డాక్టర్ల సలహా మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ను కూడా వచ్చే నెల నుండి మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా తర్వాత రెండు మూడు రోజులకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. షూటింగ్‌ ప్రారంభం అయిన రెండు నుండి మూడు వారాల్లో ఎన్టీఆర్‌ లుక్‌ కు సంబంధించిన వీడియోను రాజమౌళి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట. మొత్తానికి దసరా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సందడి మొదలు కాబోతుంది.