Begin typing your search above and press return to search.
పూణే నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన ఆర్.ఆర్.ఆర్.
By: Tupaki Desk | 16 April 2020 10:13 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే విధించిన లాక్ డౌన్.. కరోనా పరిస్థితులు చక్కబడకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు. సినిమా ఇండస్ట్రీపై ఈ మహమ్మారి ప్రభావం వలన ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు. దీని వలన కలిగిన నష్టం అంచనాలకు అందని రీతిలో ఉంది. గత కొన్ని వారాలుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి... సినిమా షూటింగులు నిలిచిపోయాయి... ఈ సమ్మర్ సీజన్ లో ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సమస్యలను సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనా మహమ్మారి ధాటికి సినీ రంగం కుదేలైందని చెప్పొచ్చు.
ఒకవేళ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి లాక్ డౌన్ ఎత్తేసినా కూడా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి బాగానే సమయం పట్టేలా ఉంది. దీంతో సినిమాల ప్లానింగ్‌లో చాలా మార్పులు తప్పేట్లు లేవు. ఇప్పట్లో సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. విమాన ప్రయాణాల విషయంలో చాలా దేశాలు ఆంక్షలు పెట్టేలా ఉండటంతో ఫారిన్ షెడ్యూళ్లను క్యాన్సిల్ చేసుకోక తప్పని పరిస్థితి. మొత్తం మీద ఇప్పట్లో ఫారిన్ వెళ్లి మంచు కొండల్లో, పెద్ద పెద్ద బ్రిడ్జుల మీద, భారీ లొకేషన్స్ లలో షూటింగ్స్ చేసే ఛాన్స్ లేదన్నమాట. ఫారిన్ టూర్ల సంగతి పక్కన పెడితే మన దేశంలో కూడా అన్ని ప్రాంతాలకూ ఇష్టం వచ్చినట్లు తిరిగే పరిస్థితి లేదు. దీంతో కథ రీత్యా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇప్పుడు ఆ వాతావరణాన్ని మన దగ్గరే తీసుకొచ్చేలా సెట్స్ వేసి మేనేజ్ చేసుకోవాల్సిందే.
ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం షూటింగ్స్ జరుపుకున్న చిత్ర బృందాలు కూడా ఇక్కడే షూటింగ్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్టోరీలలో కూడా చాలా మార్పులు చేసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ కూడా అదే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాలో కొన్ని భారీ సన్నివేశాల కోసం మహారాష్ట్రలోని పుణెలో సెట్టింగ్స్ వేయాలని అనుకున్నారు. సాబు సిరిల్ బృందం అక్కడ కొన్ని లొకేషన్స్ లో రెక్కీ నిర్వహించి సెట్స్ వేసేందుకు ప్రణాళికలు కూడా పూర్తి చేసింది. కానీ రాబోయే కొన్ని నెలలు ఇతర రాష్టాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో హైదరాబాద్‌లోనే ఆ సెట్టింగ్స్ వేసి షూటింగ్ అంతా ఇక్కడే జరపాలని జక్కన ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం సాబు సిరిల్ టీమ్ అదే పనిలో ఉన్నారని సమాచారం. లాక్ డౌన్ ఎత్తేసి షూటింగులకు అనుమతి ఇచ్చిన వెంటనే సెట్స్ నిర్మాణం ప్రారంభిస్తారట. ఏదేమైనా కొన్ని నెలల పాటు సినిమా షూటింగుల కోసం మన సరిహద్దులు దాటి బయటకి పోయే పరిస్థితులైతే కనిపించడం లేదని చెప్పవచ్చు.