Begin typing your search above and press return to search.

ప్లానింగ్ లో బిజీగా ఉన్న జక్కన్న!

By:  Tupaki Desk   |   4 Jun 2020 10:50 AM GMT
ప్లానింగ్ లో బిజీగా ఉన్న జక్కన్న!
X
గత మూడు నెలలుగా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఫిలింమేకర్లు ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్నీ అటూ ఇటూ అయ్యాయి. ఈ నెల లోనే షూటింగులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో దర్శకనిర్మాతలు షూటింగులు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నారట.

రాజమౌళి తన ఆఫీసులో టీమ్ తో కలిసి షెడ్యూల్స్ ప్లాన్ చెయ్యడంలో బిజీగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించేలోపు షూటింగుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. గతంలో వేసిన సెట్ లో కొంత టాకీ పార్ట్ చిత్రీకరణ జరిపేందుకు రెడీ అవుతున్నారట. ఇది ఓ చిన్న షెడ్యూల్ అని.. ఇది పూర్తయ్యే లోపుగా పూణె సెట్ ను నిర్మించేందుకు ప్లానింగ్ జరుగుతోందట. ఇందులో ఒక లాంగ్ షెడ్యూల్ జరుగుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే షూటింగ్ లొకేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా చర్చలు సాగుతున్నాయట. తక్కువ సిబ్బందితో షూటింగును ఎలా పూర్తి చెయ్యాలి.. క్వాలిటీ మీద ప్రభావం పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. రెండు రోజులు షూటింగ్ జరిగితే అంతా నార్మల్ అవుతుందని భావిస్తున్నారట.