Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు ఇది ప‌రీక్షా కాలం.. ప్యాస‌వుతాడా?

By:  Tupaki Desk   |   3 Jun 2020 9:30 AM GMT
జ‌క్క‌న్న‌కు ఇది ప‌రీక్షా కాలం.. ప్యాస‌వుతాడా?
X
మ‌హ‌మ్మారీ ఉరుములా మీద ప‌డుతోంది. ఓవైపు దేశంలో రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు అంత‌కంత‌కు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో వినోద‌ప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు కేంద్ర‌- రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేశాయి. వీటి ఆస‌రాగా ఇప్ప‌టికే ప‌లు పరిశ్ర‌మ‌ల్లో షూటింగులు మొద‌ల‌య్యాయి.

తొలిగా కేర‌ళ‌లో షూటింగుల‌కు వెసులుబాటు క‌ల్పించ‌గా 50 మంది స‌భ్యుల‌తో సామాజిక దూరం పాటిస్తూ.. నిర్ధేశించిన జాగ్ర‌త్త‌ల‌తో షూటింగులు చేసుకుంటున్నారు. ముంబై - మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలంగా ఉన్నా కానీ బాలీవుడ్ శ్రేయ‌స్సును కోరి ప్ర‌భుత్వం షూటింగుల‌కు వెసులుబాటు క‌ల్పించింది. 50మంది లోపు సిబ్బంది.. ఏజ్డ్ ప‌ర్స‌న్స్ నిషేధం వంటి కొన్ని కండీష‌న్ల‌తో షూటింగులు చేసుకుంటున్నారు. త‌మిళ-తెలుగు సినిమాల షూటింగులకు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించాయి ప్ర‌భుత్వాలు. కేవ‌లం 50మంది టీమ్ తో అన్ని నియ‌మాల్ని పాటిస్తూ షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సైతం వెసులుబాటు క‌ల్పించింది.

అయితే ఇది భారీ పాన్ ఇండియా సినిమాల‌కు కుదురుతుందా? అంటే సందేహ‌మే. భారీత‌నం భారీ జ‌న‌సందోహంతో నిండిన ఫ్రేములు విజువ‌ల్స్ ని తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశం ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ స‌హా జాన్ లాంటి చిత్రాల‌కు ఈ త‌ర‌హా అవ‌స‌రం ప‌డుతుంది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ కోసం ప‌రిమిత సిబ్బంధితో రాజ‌మౌళి ఎలా నెట్టుకొస్తారు? అన్న సంశ‌యం క‌ల‌గ‌క మాన‌దు. ఒక సాధార‌ణ స‌న్నివేశాన్ని అయినా ప‌కడ్భందీ స్టాఫ్ తో అద‌న‌పు సిబ్బందితో షూట్ చేయడం రాజ‌మౌళి స్టైల్. అలాంటిది మ‌హ‌మ్మారీ నియ‌మాల‌తో ఎలా వేగుతున్నాడో స‌స్పెన్స్ గా మారింది.

ఇంత క‌ష్ట‌కాలంలోనూ ఆయ‌న ఎంతో నిబ్బ‌రంగా ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూటింగ్ కి రెడీ అయ్యారు. అన్ని ప్ర‌భుత్వ నియ‌మాల్ని క‌ఠిన నిబంధ‌న‌ల్ని పాటిస్తూనే చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే గండిపేట సెట్స్ లో చిత్రీక‌ర‌ణ‌కు ఏర్పాట్లు సాగుతున్నాయిట‌. అయితే జ‌క్క‌న్న ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఇక ఆయ‌న భారీ సీజీ వ‌ర్క్ వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ తో ముడిప‌డిన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారా? లేక ఏ త‌ర‌హా స‌న్నివేశాల్ని ఇక‌పై తీయ‌నున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంటుంది.

రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో ఇంత పెద్ద సినిమా బిజినెస్ ఏ రేంజులో పూర్త‌వుతుంది? అన్న‌ది మీమాంశ‌గానే మారింది. ఇక ఇప్ప‌టికే రిలీజ్ తేదీపైనా డైల‌మా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి 2021 రేస్ నుంచి త‌ప్పుకుని స‌మ్మ‌ర్ లేదా ఇంకా ఆల‌స్యంగా రిలీజ‌వుతుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి.