Begin typing your search above and press return to search.

#RRR పులితో ఫైట్ సీన్ లీకిచ్చిందెవ‌రు?

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:19 AM IST
#RRR పులితో ఫైట్ సీన్ లీకిచ్చిందెవ‌రు?
X
సౌత్ స్టార్ డైరెక్ట‌ర్లు శంక‌ర్.. రాజ‌మౌళి ఎలాంటి ఠ‌ఫ్ టాస్క్ మాస్ట‌ర్లో తెలిసిందే. ఆన్ లొకేష‌న్ షూటింగ్ జ‌రిగేప్పుడు సెల్ ఫోన్లు అనుమ‌తించ‌రు. ముందే స్ట్రిక్టుగా కండిష‌న్స్ అప్ల‌య్! అంటూ స్టార్లు స‌హా లొకేష‌న్ లో ఉన్న అంద‌రికీ నియ‌మం పెడ‌తారు. అధికారిక పోస్ట‌ర్ త‌ప్ప వేరే ఏదీ లీక్ కావ‌డానికి లేద‌న్న రూల్ స్ట్రిక్టుగానే అమ‌ల్లో ఉంటుంది. అయితే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆ ఇద్ద‌రికీ లీకుల బెడ‌ద మాత్రం త‌ప్ప‌డం లేదు. ఇంత‌కుముందు 2.0 ఇప్పుడు 'భార‌తీయుడు 2'కి సంబంధించిన ర‌క‌ర‌కాల లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం శంక‌ర్ బృందాన్ని క‌ల‌వ‌ర‌పెట్టింది.

ప్ర‌స్తుతం దర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి స‌న్నివేశం అదే. 2019 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా #RRR కి సంబంధించిన ర‌క‌ర‌కాల లీకులు ఇప్ప‌టికే ఇబ్బందిక‌రంగా మారాయి. తార‌క్ .. చ‌ర‌ణ్ లుక్ రివీల్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డాల‌నుకున్నా.. వీళ్ల ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు చూశాక గెట‌ప్పులు ఎలా ఉంటాయో అభిమానుల‌కు అర్థ‌మైపోయింది. ఇంత‌కుముందు షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉందో స్ప‌ష్టంగా తెలిసిపోయింది. తార‌క్ క్యాప్ ఎందుకు ధ‌రించారు? అన్న డిబేట్ అభిమానుల్లో న‌డిచింది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి మ‌రింత స్ట్రిక్టు చేసినా ఏదీ ఆగ‌లేదు. తాజాగా ఎన్టీఆర్ పై చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ లుక్ లీకై క‌ల‌వ‌ర‌పెట్టింది.

ఇది మూవీలో ఎంతో ఇంపార్టెంట్ సీన్. అది కూడా కొమురంభీమ్ పాత్ర‌ధారి ద‌ట్ట‌మైన అడ‌విలో పెద్ద పులితో భీక‌ర పోరాటం చేస్తున్నారు. సినిమాలో ఇది ఎగ్జ‌యిట్ మెంట్ పెంచే ఇంపార్టెంట్ సీన్. ఆ ఫైట్ లో తార‌క్ ఎలా ఉంటారో లీక్డ్ ఫోటో చెబుతోంది. దీంతో ఖంగుతిన్న రాజ‌మౌళి వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు రెడీ అయ్యారు. కాపీ రైట్ చ‌ట్టాన్ని ఉపయోగించి ఆ ఫోటోని ఆన్ లైన్ నుంచి రిమూవ్ చేశారు. అయితే తార‌క్ .. చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఉత్కంఠ‌కు మాత్రం జ‌క్క‌న్న తెర దించ‌లేక‌పోతున్నారు. జూలై 30 రిలీజ్ అన్నారు. జ‌న‌వ‌రిలో అడుగు పెట్టినా ఇంకా ఏదీ ప్ర‌మోష‌న్ క‌నిపించ‌లేదు. క‌నీసం ఫ‌స్ట్ లుక్ వ‌చ్చినా ఫ్యాన్స్ కూల్ అయ్యి ఉండేవారే. ఇంకా ఎదురు చూపులు స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది. ఇక ఈ మూవీలో పులితో ఫైట్ అంటే హాలీవుడ్ లెవ‌ల్లో విజువ‌ల్ గ్రాఫిక్స్ ని జోడించి చూపిస్తారనే అంచ‌నాలున్నాయి. వార్ ఆఫ్ ది యారోస్ పులి ఫైట్ సీన్.. ఆంగ్ లీ లైఫ్ ఆఫ్ పై రేంజు పులిని చూపిస్తార‌న్న ఆశ అభిమానుల‌కు ఉంది. మ‌రి జ‌క్క‌న్న ఏ రేంజులో చూపిస్తారు? అన్న‌ది చూడాలి.