Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ సంక్రాంతికి లేనట్లే!

By:  Tupaki Desk   |   15 May 2020 6:45 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ సంక్రాంతికి లేనట్లే!
X
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ 70 శాతంకు పైగా పూర్తి అయ్యింది. లాక్‌ డౌన్‌ సఢలించి షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తే ఖచ్చితంగా చకచక షూటింగ్‌ జరిపి అనుకున్నట్లుగా సంక్రాంతికే విడుదల చేస్తాం అంటూ కొన్ని రోజుల క్రితం చెప్పిన దానయ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందంటూ ప్రకటించాడు.

ఒక ఇంగ్లీష్‌ దిన పత్రికతో మాట్లాడిన దానయ్య షూటింగ్‌ ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం తక్కువ మందితో షూటింగ్‌ చేసుకునేందుకు అనుమతులు ఇస్తుందని ఎదురు చూస్తున్నాం. త్వరలోనే మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టాలని ఆశిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్‌కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. కనుక సంక్రాంతికి విడుదల సాధ్యం కాకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయంను తీసుకోలేదన్నాడు.

దానయ్య మాటలతో సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల ఉండదు. షూటింగ్‌ కాస్త అటు ఇటుగా అయినా బాహుబలి 2 రిలీజ్‌ అయిన ఏప్రిల్‌ 28న విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు నెలల్లో అయినా షూటింగ్స్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ ను పూర్తి చేసి వచ్చే సమ్మర్‌ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌.. చరణ్‌ లు కొమురం భీమ్‌ అల్లూరి పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఈ చిత్రంలో నటిస్తోంది.