Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరి మా హీరో సినిమా ఎప్పుడు..?

By:  Tupaki Desk   |   26 Jan 2021 5:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరి మా హీరో సినిమా ఎప్పుడు..?
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ ఇచ్చేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని ద‌స‌రా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 13న విడుద‌ల చేయ‌డానికి ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ట్రిపుల్ ఆర్.. ఈసారి డేట్ ఫిక్స్ చేసి త‌మకు ఓ క్లారిటీ ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. రాజ‌మౌళి అండ్ టీమ్ ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో ఇప్పుడు మిగతా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ డేట్స్ విషయంలో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఎంతగానో హైప్ ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా విడుదల తేదీ గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు 'రాధే శ్యామ్' టీమ్ ఇంకా రిలీజ్ డేట్ చెప్ప‌కుండా మౌనం వ‌హించ‌డం డార్లింగ్ అభిమానుల‌కి ఆగ్ర‌హం తెప్పిస్తోంది. 'రాధే శ్యామ్' అప్డేట్స్ విషయంలో మొదటి నుంచీ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తూ వస్తున్న యూవీ టీమ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. యూవీ సింబల్ తో మీమ్స్ క్రియేట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. మనకందిన ఇన్ ఫో ప్ర‌కారం ఈ పీరియాడికల్ లవ్ స్టొరీ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్స్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి త్వరలోనే 'రాధే శ్యామ్' మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.