Begin typing your search above and press return to search.

RRR: న్యూ రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసిన జక్కన్న?

By:  Tupaki Desk   |   5 May 2020 5:45 AM GMT
RRR: న్యూ రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసిన జక్కన్న?
X
ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫిలిం 'RRR'. అన్నీ షూటింగులు వాయిదా పడడంతో 'RRR' షూటింగ్ కూడా అర్థంతరంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చెయ్యగలరా లేదా అనే విషయంపై గత కొన్ని వారాలుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై కొత్త టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను మొదట ఈ ఏడాది జూలై 30 వ తారీఖున విడుదల చెయ్యాలని అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా కరోనా క్రైసిస్ కారణంగా మరోసారి షూటింగుకు అవాంతరం ఏర్పడడంతో విడుదల తేదీని వాయిదా వేయక తప్పలేదు. ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'RRR' సినిమాను జనవరి 8 నుంచి 2021 జులై 30 వ తారీఖుకు వాయిదా వేస్తున్నారట. అంటే సరిగ్గా మొదటిసారి ప్రకటించిన డేట్ కు సరిగ్గా ఏడాది తర్వాత అన్నమాట.

లాక్ డౌన్ విరమణ తర్వాత షూటింగులకు అనుమతి ఇవ్వగానే 'RRR' షూటింగ్ ప్రారంభిస్తారట. ఇప్పటివరకూ 75% షూటింగ్ పూర్తయిందట. ఇంకా పెండింగ్ ఉన్న షూటింగ్ లో అలియా భట్ పోర్షన్ ఉందని అంటున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ఈ లెక్కన 'RRR' కోసం అభిమానులు మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.