Begin typing your search above and press return to search.

RRR - రాధేశ్యామ్ సినిమాలు ఆ తేదీని మర్చిపోవాల్సిందే..

By:  Tupaki Desk   |   27 Jan 2022 12:00 PM IST
RRR - రాధేశ్యామ్ సినిమాలు ఆ తేదీని మర్చిపోవాల్సిందే..
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం రెండు విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు మార్చి 18న RRR రాకపోతే డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రెండు సినిమా నిర్మాతలు మార్చి 18న విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ నటించిన ఆఖరి సినిమా 'జేమ్స్' ఫస్ట్ లుక్ బుధవారం విడుదలైంది. అప్పూ సోదరుడు శివ రాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పించి ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే పునీత్‌ కు నివాళిగా ఆయన గౌరవార్థం మార్చి మూడో వారంలో ఏ సినిమాను ప్రదర్శించకూడదని కన్నడ సినిమా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా మార్చి 17 నుంచి 23వ తేదీ వరకు ఇతర సినిమాలేవీ విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ తీర్మానించారు. అంటే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మూడో వారంలో అన్ని థియేటర్లలో పునీత్ రాజ్‌ కుమార్ 'జేమ్స్' సినిమా మాత్రమే ప్రదర్శించబడుతుంది. కాబట్టి 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'రాధే శ్యామ్' సినిమాలను కన్నడలో ప్రదర్శించలేరు.

RRR మరియు 'రాధే శ్యామ్' సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కన్నడలో మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభాస్ సినిమాని పరిస్థితులు అనుకూలిస్తే మార్చి నెలాఖరున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.