Begin typing your search above and press return to search.

#RRR ప్రీబిజినెస్ 2.0 వ‌సూళ్ల‌కు స‌మానం..!

By:  Tupaki Desk   |   28 March 2021 8:00 AM IST
#RRR ప్రీబిజినెస్ 2.0 వ‌సూళ్ల‌కు స‌మానం..!
X
భార‌త‌దేశంలో ఏ సినిమాకి జ‌ర‌గ‌నంత‌గా `ఆర్.ఆర్.ఆర్` ప్రీబిజినెస్ సాగుతోంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సుమారు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఐదు భాష‌ల‌కు థియేట్రిక‌ల్ హ‌క్కులు రూపంలో 350కోట్ల మేర బిజినెస్ పూర్తి చేయ‌గా.. మ‌రో ఆరు భాష‌ల్లో డీల్ పూర్తి చేయాల్సి ఉంది.

ప్రాంతాల వారీగా చూస్తే... నైజాంలో దాదాపు 75 కోట్లు .. ఆంధ్ర సీడెడ్ 165 కోట్లు .. తమిళనాడులో 48 కోట్లు .. కర్ణాటకలో 45 కోట్లు .. కేరళలో 15 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఒక హిందీ రైట్స్ దాదాపు 100 కోట్లకు అమ్మగా.. ఓవర్సీస్ లో రూ. 77 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

శాటిలైట్ డిజిటల్ హక్కులు కూడా భారీ ధర పలికింది. ఓ ప్రముఖ సంస్థ అన్ని భాషల డిజిటల్ - శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 225 కోట్లు ఆఫర్ చేసిందని ట్రేడ్ టాక్. 2.0 కంటే బెట‌ర్ బిజినెస్ సాగిస్తోంద‌న్న గుస‌గుసా టాలీవుడ్ ఇన్ సైడ్ వినిపిస్తోంది. థియేట్రిక‌ల్ - నాన్ థియేట్రిక‌ల్ రూపంలో దాదాపు 600 కోట్లు పైగా బిజినెస్ చేస్తోంది. ఇది 2.0 వ‌సూళ్ల‌కు స‌మాన సంఖ్య‌. అయితే అందుకు డ‌బుల్ లాభాలు ఆర్జించాలంటే 1000 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంటుంది.