Begin typing your search above and press return to search.

RRR వాయిదాతో డ‌జ‌ను రిలీజులు

By:  Tupaki Desk   |   4 Jan 2022 12:00 PM IST
RRR వాయిదాతో డ‌జ‌ను రిలీజులు
X
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ అనూహ్య వాయిదా ఇండ‌స్ట్రీని డైల‌మాలోకి నెట్టేసిన సంగ‌తి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేష‌న్ లో ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR ఓమిక్రాన్ టెన్ష‌న్స్ ఏడుమ వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమా వాయిదా పడడం తక్కువ బడ్జెట్ తెలుగు సినిమాలకు వరంగా మారింది. ఈ సంక్రాంతి సీజన్ లో డ‌జ‌ను సినిమాలు విడుదలవుతున్నాయి.

దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ రెడ్డి.. మహేష్ బాబు మేనల్లుడు, అశోక్ గల్లా... చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ .. సాయి కుమార్ తనయుడు ఆది... రానా దగ్గుబాటి తదితరుల సినిమాలు రేసులో ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రభాస్ న‌టించిన రాధే శ్యామ్ సంక్రాంతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓమిక్రాన్ కేసులు పెరిగితే మేకర్స్ సినిమాను వాయిదా వేయవచ్చు. లేదా ఇంకేదైనా కొత్త ప్ర‌ణాళిక తెర‌పైకి వ‌చ్చే వీలుంది. అలాంటప్పుడు నాగార్జున బంగార్రాజు మాత్రమే పొంగల్ కు విడుదలయ్యే పెద్ద సినిమా అవుతుంది.

సంక్రాంతి రేసులో ఉన్న చిన్న సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే... అతిథి దేవో భవ – జనవరి 7న విడుద‌ల‌వుతోంది. రానా 1945 - జనవరి 7 .... వేయి శుభములు కలుగు నీకు – జనవరి 7... రాధే శ్యామ్ – జనవరి 14 .. శేఖర్ – జనవరి 14 ... DJ టిల్లు – జనవరి 14 .... 7 డేస్ 6 నైట్స్ - జనవరి 14 ..8. సూపర్ మచ్చి – జనవరి 14 ... రౌడీ బాయ్స్ – జనవరి 14 ... విశాల్ సామాన్యుడు (డబ్ మూవీ) – జనవరి 14 (ఇంకా ధృవీకరించబడలేదు)... బంగార్రాజు – జనవరి 15 ... హీరో – జనవరి 15.. న విడుద‌ల‌వుతున్నాయి. సంక్రాంతి రేసులో మరిన్ని చిత్రాలు చేరే అవకాశం ఉంది.

వీటిలో బంగార్రాజు.. సామాన్యుడు చిత్రాలు స‌హా ఆశిష్ రెడ్డి-దిల్ రాజుల‌ రౌడీ బోయ్స్ .. మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ న‌టించిన‌ హీరో చిత్రాల‌కు కొంత హైప్ క‌పిపిస్తోంది. ఇత‌ర సినిమాల‌కు ప్ర‌చారంలో హైప్ క‌నిపించ‌లేదు. సంక్రాంతి రేసులో డ‌జ‌ను సినిమాలు విడుద‌ల‌వుతుండ‌డం అన్న‌ది ఈసారి ఉత్కంఠ‌ను పెంచుతోంది.