Begin typing your search above and press return to search.

హిందీలో RRR ఓపెనింగ్ డే రికార్డ్ బ్రేక్?

By:  Tupaki Desk   |   9 April 2022 4:41 AM GMT
హిందీలో RRR ఓపెనింగ్ డే రికార్డ్ బ్రేక్?
X
కోవిడ్ మహమ్మారి తర్వాత దేశ‌విదేశాల్లో థియేట‌ర్లు అన్నీ తెరుచుకోవ‌డంతో సినీప‌రిశ్ర‌మ‌లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. నిర్మాత‌లు త‌మ భారీ సినిమాల్ని రిలీజ్ చేస్తే క‌నీస గ్యారెంటీ ఉందిప్పుడు.

ఇక ఇటీవ‌ల విడుద‌లైన ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌న విజ‌యం సాధించి 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌శ్మీర్ ఫైల్స్ లాంటి చిన్న సినిమా 350 కోట్లు వ‌సూలు చేయ‌డం మ‌రింత పెద్ద బూస్ట్ అని చెప్పాలి.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రికార్డుల్ని కేజీఎఫ్ 2 బ్రేక్ చేసేందుకు వ‌స్తోంది! అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. తాజా స‌మాచారం మేర‌కు.. హిందీ మార్కెట్ లో RRR రికార్డును కేజీఎఫ్ 2 కొట్టేస్తోందంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్ హిందీలో రూ. 19 కోట్ల ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌తో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. ఈ రికార్డును KGF2 బ్రేక్ చేస్తోంద‌ని స‌మాచారం.

KGF 2 రూ. 35 కోట్లతో హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఓపెనింగ్ ను నమోదు చేయడానికి సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఒక సంచలనాత్మక ఫీట్ గా దీనిని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషిస్తోంది. KGF 2 మొదటి భాగం హైప్ ఇప్పుడు పార్ట్ 2 కి ఎక్కువగా క‌లిసొస్తోంద‌ని టాక్ ఉంది. కేజీఎఫ్ 1 హిందీ బెల్ట్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

న్యూ ఫ్లేవ‌ర్డ్ జాన‌ర్ తో య‌ష్ అక్క‌డ బంప‌ర్ హిట్ కొట్టాడు. అందుకే హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 బాక్సాఫీస్ లు బ‌ద్ధ‌లు కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి ప్రారంభంతో టేకాఫ్ అవుతుంద‌ని అంచనా వేస్తున్నారు.

కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. యష్ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై విజ‌య్ కిరంగ‌దుర్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు సంజ‌య్ ద‌త్- ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌ల్ని పోషించ‌డంతో హిందీ మార్కెట్లో హైప్ ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది.