Begin typing your search above and press return to search.

RRR: 8 నిమిషాల సుదీర్ఘమైన పాట గురించి మరిన్ని వివరాలు..!

By:  Tupaki Desk   |   22 Jun 2021 7:30 AM GMT
RRR: 8 నిమిషాల సుదీర్ఘమైన పాట గురించి మరిన్ని వివరాలు..!
X
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. అలియా భట్‌ - ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది. నిన్న సోమవారం నుంచి హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోలో కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టారు. తొలి రోజు చరణ్‌ షూట్‌ లో పాల్గొనగా.. ఈరోజు తారక్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. దాదాపు వారానికి పైగా సాగే ఈ షెడ్యూల్‌ లో హీరోలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇదే క్రమంలో చిత్రంలోని రెండు పాటలను షూట్ చేయనున్నారు.

'ఆర్‌.ఆర్‌.ఆర్' కోసం ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లపై జక్కన్న ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ నిర్మాణం చేపట్టారు. 25 నుంచి 30 రోజులు షూట్ చేయాలని ప్లాన్ చేసిన ఈ పాట సినిమాలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో 8 నిమిషాల నిడివితో ఉంటుందట. దీని కోసం కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసారట. హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ గురించి తెలియజెప్పే ఈ పాటలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. మరి ఇది సెలబ్రేషన్ పాట అవుతుందా లేదా దేశభక్తిని చాటిచెప్పే గీతమా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్‌ ల జీవితాల స్ఫూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ''ఆర్.ఆర్.ఆర్'' రూపొందుతోంది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని - రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెంథిల్‌ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.