Begin typing your search above and press return to search.

#RRR అల్లూరి వ‌ర్సెస్ భీమ్ .. ఏమిటీ ట్విస్టు జ‌క్క‌న్నా?

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:30 AM IST
#RRR అల్లూరి వ‌ర్సెస్ భీమ్ .. ఏమిటీ ట్విస్టు జ‌క్క‌న్నా?
X
#RRR లో ఊహించ‌ని ట్విస్టులు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని ట్రీటివ్వ‌బోతున్నాయా? ఈ మూవీలో స్నేహితుల మ‌ధ్య బిగ్ ఫైట్ ఆడియెన్ ని ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుందా? అంటే.. జ‌క్క‌న్న‌- విజ‌యేంద్ర ప్రసాద్ మైండ్ అలానే ఆలోచించింద‌నేది ఓ గుస‌గుస‌.

హీరో వ‌ర్సెస్ హీరో అన్న తీరుగా కొట్టుకుంటేనే ఆడియెన్ కి మజా. స‌రిగ్గా అలాంటి స్క్రీన్ ప్లే టెక్నిక్ ని క‌థా వైవిధ్యాన్ని అనుస‌రించి ఆడియెన్ ని కుర్చీ అంచుమీద కూచోబెట్టే ఆలోచ‌న చేశార‌న్న గుస‌గుస ఇప్పుడు తార‌క్ .. చ‌ర‌ణ్ అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది.

ఎన్‌టిఆర్- చరణ్ ల‌పై ఆడియెన్ ని మంత్రముగ్దులను చేసే పోరాట సన్నివేశాన్ని ప్ర‌స్తుతం చిత్రీకరిస్తున్నారనేది తాజాగా అందిన వార్త‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి మొదట చరణ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి షూట్ కొనసాగుతోంది. ఆర్.‌ఎఫ్.‌సిలో ఇప్పటి వరకు హై ఆక్టేన్ పోరాట సన్నివేశం తెర‌కెక్కిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరిపైనా యాక్ష‌న్ పార్ట్ ని పీక్స్ లో పంప్ చేస్తున్నార‌ట‌. ఇది ఈ చిత్రానికి హైలైట్ అవుతుందన్న గుస‌గుస‌లా వినిపిస్తంది. ఈ సన్నివేశం బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కీలకమైన భాగంలో వస్తుంది.

అలాగే కొమ‌రం భీమ్ తో అల్లూరి సీతారామ‌రాజు ప‌రిచ‌యం సీన్ కూడా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని యాక్ష‌న్ పార్ట్ తో ర‌క‌ర‌కాల ట్విస్టులు ప‌రిచ‌యం అవుతాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అలాగే సీత పాత్ర‌ధారి అలియా భట్ ఈ నెలలో హైదరాబాద్ లో జరిగే ఆర్‌.ఆర్.‌ఆర్ షూట్ లో చేరాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అంతా మారింది. త‌న‌పై షూట్ డిసెంబర్ కు వాయిదా పడింది. ఆలియా పై చిత్రీక‌ర‌ణ‌ను ఆపి మ‌రీ సినిమాలో కీల‌క‌మైన యాక్ష‌న్ పార్ట్ ని రాజ‌మౌళి పూర్తి చేస్తున్నారు.