Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ లో ఇన్ని ట్విస్టులా

By:  Tupaki Desk   |   4 Feb 2019 10:57 AM GMT
ఆర్ ఆర్ ఆర్ లో ఇన్ని ట్విస్టులా
X
హైదరాబాద్ శివార్లలోనే షూటింగ్ జరుగుతున్నా ఆర్ ఆర్ ఆర్ గురించి ఏ చిన్న లీక్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు రెండో షెడ్యూల్ నిరాటంకంగా కొనసాగుతోంది. క్రమం తప్పకుండ మెగా పవర్ స్టార్ యంగ్ టైగర్లు షూటింగ్ అటెండ్ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సీన్ అన్ని జక్కన్న చకచకా పూర్తి చేస్తున్నాడట. అయితే ఆర్ఆర్ఆర్ థీమ్ గురించి చాలా రోజుల నుంచి పలు కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. 1940 బ్యాక్ డ్రాప్ లో ఒకరు జమిందార్ గా మరొకరు పేదవాడిగా కనిపించి వర్తమానంలో అవే పాత్రలు రివర్స్ లో ఉంటాయని చాలా కథనాలు వచ్చాయి.

అయితే వాటిని ఖండిస్తూ యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడాంతో వీటికి రెక్కలు వచ్చి చాలా దూరం వెళ్లాయి. అయితే మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు ఇప్పుడు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నాయి. వాటి ప్రకారం ఇందులో తారక్ చరణ్ పాత్రలు ఒక జన్మలో స్నేహితులుగా మరో జన్మలో అన్నదమ్ములుగా కనిపిస్తారట. అయితే వాళ్ళు విడిపోయే కారణాలు మాత్రం చాలా బలంగా ఉంటాయట. మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చే హీరోయిజం రాసుకోవడంలో తల పండిపోయిన రాజమౌళికి ఒకేసారి ఇద్దరు స్టార్లు దొరికితే ఇంకేముంది. విశ్వరూపమేగా.

అయితే ఇవన్నీ గాలి ప్రచారాలు అనిపిస్తుంది కానీ లీలగా లీకవుతున్న ఇన్ఫర్మేషన్ ని క్రోడీకరించి చూస్తే ఫైనల్ గా పైన చెప్పిన పాయింట్ కే కనెక్ట్ అవుతోంది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ వరస చూస్తే ఏడాదిన్నర ముందే ఇంత హైప్ హంగామా చేస్తోందంటే ఇక షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఏ రేంజ్ కు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాలా. కీరవాణి మరోపక్క ట్యూన్స్ కట్టే పనిలో బిజీగా ఉన్నారు. కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇస్తానని రాజమౌళికి ముందే మాట ఇచ్చాడట. ఇప్పుడు వచ్చిన కథనాల ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో తారక్ చరణ్ అల్లరి రెండు కోణాల్లో ఉంటుందన్న మాట