Begin typing your search above and press return to search.

రాంచరణ్ నిప్పు, ఎన్టీఆర్ నీరు.. రాజమౌళి లాజిక్ ఇదే

By:  Tupaki Desk   |   26 March 2020 11:30 AM GMT
రాంచరణ్ నిప్పు, ఎన్టీఆర్ నీరు.. రాజమౌళి లాజిక్ ఇదే
X
ఓ వైపు దేశంలో కరోనా కల్లోలం.. అంతా దాని గురించే చర్చ.. మరో టాపిక్ లేదు. కానీ ఈ కొత్త తెలుగు సంవత్సరాది రోజున సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. కరోనా నుంచి అందరి దృష్టి మోస్టే అవేటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వైపు మళ్లించారు జక్కన్న. సినిమా పేరు మారుస్తారని.. కొత్తది పెడుతారని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ మూడు అక్షరాలనే ‘రౌద్రం, రణం, రుధిరం’ అంటూ ప్రకటించేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్ వచ్చి ట్రెండింగ్ అయ్యింది. జక్కన్న మాయాజాలానికి అందరూ షాక్ అయ్యారు. కరోనా టాపిక్ లో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ ట్రైలర్ లో అందరూ గమనించని విషయం ఏంటంటే రాంచరణ్ ను నిప్పుతో, ఎన్టీఆర్ ను నీరుతో కదిలే ఇద్దరు అగ్నిపర్వతాల వలే రాజమౌళి చూపించారు. ఇందులో లాజిక్ ఉందంటున్నారు విశ్లేషకులు.

అల్లూరి సీతారామారాజు పాత్ర పోషించిన రాంచరణ్ ను జక్కన్న నిప్పుతో చూపించారు. నిప్పు అర్థం ఏంటంటే విప్లవ వీరుడు అల్లూరిని ఆ పోరుబాటకు ప్రతీకగా అగ్నికణంగా రాజమౌళి తీర్చిదిద్దాడు. విప్లవానికి ప్రతీక నిప్పు, ఎరుపు.. అందుకే చరణ్ ను ఆ కోణంలో ప్రజెంట్ చేశారు.

ఇక నీరును ఎన్టీఆర్ కు ఎందుకు పెట్టారన్నది అందరికీ అర్థం కానీ విషయం. దీని చరిత్ర తెలియాలంటే తెలంగాణలోని కొమురంభీం పోరాడిన కొమురం భీం జిల్లా జోడెఘాట్ కు వెళ్లాల్సిందే.. నిజాం పాలకులతో పోరాడిన కొమురం భీం నినాదం ‘జల్, జంగల్, జమీన్’. అంటే నీరు, అడవీ, తమ ప్రాంతం.. వీటి కోసం కొమురం భీం తుపాకీ చేతపట్టి నిజాం రజాకర్లను ఎదురించారు. ఇందులో మొదటిది జల్ అంటే జలం కోసం. అందుకే కొమురం భీం పోరాట స్ఫూర్తిని తెలిసేలా ఎన్టీఆర్ ను జలంతో రగిలేలా జక్కన్న తీర్చిదిద్దాడు. అదన్నమాట సంగతి.!