Begin typing your search above and press return to search.

'రౌద్రం రణం రుధిరం' - ఏంటి ఇంత పెద్ద టైటిలా...?

By:  Tupaki Desk   |   26 March 2020 7:30 PM GMT
రౌద్రం రణం రుధిరం - ఏంటి ఇంత పెద్ద టైటిలా...?
X
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ టైటిల్ గా 'రౌద్రం రణం రుధిరం' ఫిక్స్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగినట్టుగా అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికగా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. ఈ ఇద్దరు చేసే రణంగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్ళలోకే పరిమితమై పనులేమీ లేక ఒక విధమైన నిరాశగా ఉన్న సమయంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగోని వదిలి ఒకింత ఆశలు రేపాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ అంటే ఏంటని ఇన్ని రోజులనుండి ఆలోచిస్తున్న సినీ అభిమానులకు 'రౌద్రం రణం రుధిరం' అంటూ టైటిల్ బయటపెట్టారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ సినిమా పేరును ఏ పేరుతో పిలవాలనేదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాస్తవానికి రౌద్రం రణం రుధిరం అనేది చాలా పెద్దగా ఉన్న టైటిల్. ఇంత పెద్ద టైటిలా అని పెదవి విరిచిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ జనాల్లోకి వెళ్లిపోవడంతో రౌద్రం రణం రుధిరం అని ఎవరు పిలవడం లేదు. ఏ సినిమా జనాల్లోకి పోవాలంటే ఫస్ట్ ఆ సినిమా టైటిల్ జనాల్లోకి పోవాలి. రాజమౌళి గతంలో దీంట్లో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బాహుబలి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. బాహుబలి అనే ఒకే పేరుతో అన్ని భాషల్లో విడుదల చేసి యూనివర్సల్ ఫిల్మ్ గా తీర్చి దిద్దాడు. అయితే ఇక్కడ ఆర్.ఆర్.ఆర్ విషయం లో మాత్రం అది సాధ్యపడేలా కనపడటం లేదు. ఈ టైటిల్ ఖచ్చితం గా యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేయరు. దీంతో రాజమౌళి అండ్ టీమ్ బాలీవుడ్ కి తగ్గట్టు హిందీ టైటిల్, ఇతర భాషలకి ఇతర టైటిల్స్ పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందనే చెప్పవచ్చు.