Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ ఆనందం అంతవరకేనా... ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 10:32 AM GMT
ట్రిపుల్ ఆర్ ఆనందం అంతవరకేనా... ?
X
ట్రిపుల్ ఆర్ లో ఒక్కసారిగా ధీమా పెరిగింది. తెలుగు స్టేట్స్ వరకూ అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. మధ్యలో పోటీకి వచ్చిన సినిమాలు కూడా తప్పుకున్నాయి. ఇక బోరవిడుచుకుని మరీ గ్రాండియర్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాహుబలి వన్, టూ తరువాత ఒక తెలుగు సినిమాకు వేల కోట్ల రెవిన్యూ తీసుకువచ్చిన ఘనుడుగా రాజమౌళిని అంతా కీర్తించారు.

ఆ తరువాత వస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ సంగతేంటి అన్న చర్చ కూడా ఒకవైపు ఉంది. మరో వైపు చూస్తే బాహుబలి టూ వేయి కోట్ల పైన కలెక్షన్లు వసూల్ చేసి ఈ రోజుకీ టాప్ ఇండియన్ మూవీస్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. దాన్ని కొట్టడం ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యపడలేదు.

మరి రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ దాన్ని చేదిస్తుందా అన్నదే ఇక్కడ ఆలోచించే విషయం. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ని బట్టి చూస్తే సరైన టైమేనా అన్న మాట కూడా ఉంది. జనవరి 7న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక జనవరి 14న మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. 15న బంగార్రాజు మూవీని నాగార్జున ముందుకు తెస్తున్నాడు అంటున్నారు.

ఆ విధంగా చూసుకుంటే తెలుగు స్టేట్స్ కి సంబంధించి ఎక్కువ థియేటర్లలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినా కూడా ఆ సంబరం అంతా తొలి వారానికే పరిమితం అని అంటున్నారు. 14న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కావడంతో సగం థియేటర్లను ట్రిపుల్ ఆర్ వదులుకోవాల్సి ఉంటుంది. ఇక నాగార్జున మూవీకి కూడా మరికొన్ని థియేటర్లు త్యాగం చేయాలి.

అలా చూసుకుంటే ఎంత కలెక్షన్లు కొల్లగొట్టుకున్నా కేవలం ఫస్ట్ వీక్ మాత్రమే తప్ప ఆ తరువాత ఆ ఊపు తగ్గిపోతుంది అన్నదే పాయింట్. లాంగ్ రన్ లో బాహుబలి మాదిరిగా హెవీ రెవిన్యూని కలెక్ట్ చేసే పరిస్థితి అయితే ట్రిపుల్ ఆర్ కి ఉంటుందా అన్నదే ట్రేడ్ పండితుల చర్చగా ఉంది. అదే సమ్మర్ కి కనుక ఈ మూవీ వచ్చి ఉంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు సోలోగా బొమ్మ లాగించేయడానికి చాన్స్ ఉండేదన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఈ రిలీజ్ అనివార్యం. దాంతో కలెక్షన్ల మోత ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది.