Begin typing your search above and press return to search.

RRR అక్కడ పాస్ కాలేక పోయిందే?

By:  Tupaki Desk   |   20 Jan 2023 3:30 PM GMT
RRR అక్కడ పాస్ కాలేక పోయిందే?
X
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతను తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే ఈ చిత్రం ఆస్కార్ రేసులో పోటి పడుతోంది. ఇక ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు కూడా వచ్చాయి. ఇంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రానికి బాఫ్టాలో చుక్కెదురు అయింది.

ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమి ఫిల్మ్ అవార్డ్.. (బాఫ్టా)లో ఆర్ఆర్ఆర్ నామినేట్ కాలేకపోయింది. ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ ఏడాది బాఫ్టా నామినేషన్స్‌లో ఈ సినిమాను ఎంపిక చేయలేదు. బెస్ట్ ఫిల్మ్ నాన్-ఇంగ్లీష్ కేటగిరి కోసం పోటీ పడిన ఆర్ఆర్ఆర్‌... బాఫ్టా పురస్కారాల నామినేషన్‌లో తీసుకోకపోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ కాకుండా ఆళ్ క్వైట్ ఇన్ వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కార్సేజ్, డెసిషన్ టూ లీవ్, ది క్వైట్ గర్ల్ సినిమాలను ఈ విభాగంలో నామినేట్ చేశారు.

భారత్‌ నుంచి షౌనక్ సేన్ రూపొందించిన ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీ మాత్రమే నామినేట్ అయింది. ఆర్ఆర్ఆర్కు మాత్రం నామినేట్ కాలేకపోయింది. వచ్చే నెల ఫిబ్రవరి 19వ తేదీన బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం జరుగబోతుంది. రిచర్చ్ ఈ గ్రాంట్, అలిసన్ హమాండ్ ఈ షోకు హోస్ట్‌గా ఉండనున్నారు.

బాఫ్టా పురస్కారాలకు ఆర్ఆర్ఆర్ నామినేట్ కానప్పటికీ.. ఇతర అంతర్జాతీయ అవార్డుల్లో మాత్రం దుమ్మురేపుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా రెండు విభాగాల్లో సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు రాజమౌళి.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గతేడాది మార్చి 25న విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఒకేసారి విడుదలై అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.