Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : దీపావళికి ఆర్.ఆర్.ఆర్ కానుక కన్నుల పండుగ
By: Tupaki Desk | 13 Nov 2020 1:20 PM ISTరాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నుండి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫొటోను విడుదల చేశారు. రాజమౌళి.. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు పండుగ సందర్బంగా సాంప్రదాయ డ్రస్ ల్లో కనిపించి కన్నుల పండుగగా ఈ ఫొటో ఉంది. ఒకరికి ఒకరు స్వీట్లు ఇచ్చుకుంటే ఏదో సరదా సంభాషణల్లో మునిగి పోయినట్లుగా ఉన్న ఈ ఫొటో క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో జక్కన్న దీపావళి కానుకగా ఏదో ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది.
ఈ ఫొటోలో వీరు కూర్చున్న సెటప్ మరియు జరుగుతున్న సంభాషణ చూస్తుంటే వీడియో కూడా ఏమైనా విడుదల చేస్తారేమో అనిపిస్తుంది. వీడియో వచ్చినా రాకున్నా ఈ ఫొటో మాత్రం ఈ ముగ్గురి అభిమానులకు అతి పెద్ద దీపావళి కానుకగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. దీపావళికి ఆర్‌ఆర్‌ఆర్ నుండి సర్ ప్రైజ్ రాబోతుంది అంటూ రెండు రోజుల క్రితమే ప్రచారం జరిగింది. ఆ సర్ ప్రైజ్ ఇదే అయ్యి ఉంటుంది అని కొందరు ఇంకా ఏమైనా ఉందా అంటూ మరి కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.