Begin typing your search above and press return to search.

నాగ్ కోసం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాటోగ్రాఫర్...!

By:  Tupaki Desk   |   2 Aug 2020 4:30 AM GMT
నాగ్ కోసం ఆర్.ఆర్.ఆర్ సినిమాటోగ్రాఫర్...!
X
అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలల తర్వాత 'కింగ్' నాగ్ 'బిగ్ బాస్' ప్రోమో షూట్ కోసం మేకప్ వేసుకున్నారు. ఇండియన్ టెలివిషన్ రంగంలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో అయిన 'బిగ్ బాస్' తెలుగులో కూడా సక్సెస్ అయింది. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకోగా నాల్గవ సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బిగ్ బాస్' సెట్ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం నాగార్జునతో ఈ సెట్ లోనే యాడ్ షూట్ చేస్తున్నారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో చాలా రోజుల తర్వాత సందడి వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా 'బిగ్ బాస్' ప్రోమోకి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 'యమదొంగ' 'మగధీర' 'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - ది కంక్లూషన్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్ కుమార్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో టాప్ కెమెరామెన్ లలో ఒకరైన సెంథిల్ ని ఇప్పుడు 'బిగ్ బాస్' తెలుగు సీజన్-4 ప్రోమోస్ షూట్ చేయడం కోసం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రోమోస్ కి నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ షూట్ కోసం నాగ్ ఎక్స్ట్రా కేర్ తీసుకున్నట్లు ఇప్పటికే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే అర్థం అవుతోంది. అంతేకాకుండా నాగార్జున ఈ ప్రోమోలో కొత్త గెటప్ లో కనిపించనున్నాడు. త్వరలోనే స్టార్ మా వారు ఈ ప్రోమో రిలీజ్ చేయనున్నారు.