Begin typing your search above and press return to search.

RRR బ‌డ్జెట్.. జ‌క్క‌న్న మైండ్ లో ఏం ఉంది?

By:  Tupaki Desk   |   29 Oct 2019 4:15 AM GMT
RRR బ‌డ్జెట్.. జ‌క్క‌న్న మైండ్ లో ఏం ఉంది?
X
భారీ పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ కి క‌లిసొస్తున్నాయా లేదా? అంటే ట్రేడ్ విశ్లేష‌ణ వేరుగా ఉంది. పాన్ ఇండియా చిత్రాల‌తో తెలుగు సినిమా క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోంది. ఉత్త‌రాదినా మ‌న ఇమేజ్ పెరుగుతోంది. కానీ పంపిణీదారులకు మాత్రం ఇరుగు పొరుగు భాష‌ల్లో ఆశించిన రిజ‌ల్ట్ రావ‌డం లేద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ ప‌రిస్థితి ఏమిటి? అంటూ మీడియాలో చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌లే రిలీజైన సాహో రిజ‌ల్ట్ ని ప‌రిశీలించినా.. సైరా రిజ‌ల్ట్ ప‌రిశీలించినా కొన్ని నిజాలు తెలిసొచ్చాయి. సైరా హిట్టు టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో పొరుగున‌ చ‌తికిల‌బ‌డింది. ఓవ‌ర్సీస్ స‌హా ఇరుగు పొరుగు భాష‌ల్లో ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సాహోని హిందీ మార్కెట్ ఆదుకున్నా మిగ‌తా చోట్ల పెద్ద స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు.

స‌రిగ్గా ఈ ప‌రిణామంపై జ‌క్క‌న్న సీరియ‌స్ గా ఆలోచిస్తున్నాడ‌ని బ‌డ్జెట్ ని కంట్రోల్ లో ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొంత‌కాలంగా ప్ర‌చార‌మ‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య 300 కోట్ల బ‌డ్జెట్ లేదా అంత‌కుమించిన పెట్టుబ‌డి పెట్టాల‌ని భావించినా ఇప్పుడు కేవ‌లం 250 కోట్ల లోపు బ‌డ్జెట్ తో సినిమాని పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. అంటే బాహుబ‌లికి మించ‌ని బ‌డ్జెట్ తోనే ఆర్.ఆర్.ఆర్ ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. థియేట్రిక‌ల్ బిజినెస్ కి త‌గ్గ‌ట్టే థియేట‌ర్ల నుంచి ర‌ప్పించేలా ప్లాన్ ని డిజైన్ చేస్తున్నార‌ట‌. ఓవ‌ర్ బోర్డ్ అవ్వ‌కుండా ఉండాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.