Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో కలిసి సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన 'ఆర్.ఆర్.ఆర్' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   1 March 2021 2:00 PM IST
సూపర్ స్టార్ తో కలిసి సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ..!
X
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్.. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'హైవే' '2 స్టేట్స్‌' 'డియర్‌ జిందగీ' 'రాజీ' 'ఉడ్తా పంజాబ్' 'కలంక్‌' 'గల్లీ బాయ్‌' 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' 'బద్రీనాథ్ కీ దుల్హనియా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి దిగుతోంది. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా మారి రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్ల జాబితాలోకి అలియా కూడా చేరిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అలియ.. 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' బ్యూటీ తాజాగా తన ఫస్ట్ వెంచర్ ''డార్లింగ్స్'' సినిమాని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి నిర్మిస్తున్నట్లు ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది. రెడ్ చిల్లేస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి గౌరీ ఖాన్ - ఆలియా - గౌరవ్ వర్మ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. ఇందులో అలియాతో పాటు షెఫాలి షా - విజయ్ వర్మ - రోషన్ మ్యాథ్యు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ జస్మిత్ కె రీన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఏదేమైనా 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రొడ్యూసర్ గా మారిన అలియా ముందు చూపుని మెచ్చుకోవాల్సిందే. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుంది. అలానే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్' అనే సినిమా చేస్తోంది. ఇక కింగ్ నాగార్జున - అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కూడా అలియా హీరోయిన్ గా నటిస్తోంది.