Begin typing your search above and press return to search.

మరోసారి నువ్వా నేనా.. ఆర్ఆర్‌ఆర్‌ vs కేజీఎఫ్‌

By:  Tupaki Desk   |   2 Aug 2022 2:30 AM GMT
మరోసారి నువ్వా నేనా.. ఆర్ఆర్‌ఆర్‌ vs కేజీఎఫ్‌
X
ఈ ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచి పోయే సంవత్సరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి.. ఆ రెండు కూడా సౌత్‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినిమాలే అవ్వడం మరింత గర్వకారణం. బాలీవుడ్‌ సినిమాలు వంద కోట్ల వసూళ్లను రాబట్టడం కోసం పిల్లమొగ్గలు వేస్తున్న ఈ సమయంలో వెయ్యి కోట్లు అంతకు మించి సాధించిన సినిమాలు గా కేజీఎఫ్ మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ లు నిలిచాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామిని సృష్టించగా.. ఓటీటీ ద్వారా కూడా అంతే స్థాయిలో సందడి చేసిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లు ఇంకా కూడా పలు దేశాల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్‌ ఆర్ ఆర్‌ ఓటీటీ ద్వారా సాధించిన రికార్డు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇంగ్లీష్‌ సినిమాలతో సమానంగా మన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కుమ్మేసింది.. ఇంకా కుమ్మేస్తూనే ఉంది. థియేటర్ల లో విడుదల అయిన సమయంలో బాక్సాఫీస్‌ వసూళ్ల పరంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను కేజీఎఫ్ 2 బీట్‌ చేసింది. కేజీఎఫ్‌ భారీ వసూళ్లతో ఈ ఏడాది నెం.1 సినిమా గా నిలిచింది. ఓటీటీ లో మాత్రం నో డౌట్ అన్నట్లుగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ నెం.1 గా నిలిచిందట.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా మరోసారి తలపడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దాడి.. ఓటీటీ సందడి పూర్తి అయిన తర్వాత శాటిలైట్ టెలికాస్ట్ కు సిద్ధం అయ్యాయి. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తో పాటు కేజీఎఫ్ 2 కూడా బుల్లి తెర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నం అయ్యింది.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాను హిందీ లో జీ సినిమా టెలికాస్ట్ చేయనుండగా.. తెలుగు తో పాటు ఇతర సౌత్‌ భాష ల్లో స్టార్‌ వారు టెలికాస్ట్ చేయబోతున్నారు. తెలుగు లో స్టార్‌ మా లో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా రాబోతుంది. ఇక కేజీఎఫ్ 2 ను అన్ని భాషల్లో కూడా జీ వారే టెలికాస్ట్‌ చేయబోతున్నారు. తెలుగు లో జీ తెలుగు వారు అతి త్వరలోనే కేజీఎఫ్ 2ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఈ రెండు సినిమాలు కూడా దేశ వ్యాప్తంగా ఒకే సారి వరల్డ్‌ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతాయా లేదంటే వివిధ భాషల యొక్క వర్షన్ లు వివిధ డేట్స్ ల్లో వస్తాయో చూడాలి. ఈ రెండు సినిమాలు కూడా టీఆర్పీ రేటింగ్స్ పరంగా మరోసారి ఢీ కొట్టబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏది టాప్ లో నిలుస్తుందో చూడాలి.