Begin typing your search above and press return to search.

రానా - మిహీకాల పెళ్లిలో స్పెషల్ అదే...!

By:  Tupaki Desk   |   25 July 2020 11:50 AM GMT
రానా - మిహీకాల పెళ్లిలో స్పెషల్ అదే...!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల వివాహాలు జరిగిపోగా యువ హీరో నితిన్ వివాహం ఈ రోజు తాజ్ ఫలక్ నుమా ఫ్యాలెస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో భల్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బ‌జాజ్‌ ను ప్రేమ వివాహం చేసుకోనున్నారు రానా. ఇటీవ‌ల దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్‌ ల రోకా వేడుక‌ను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. ఇక ఆగస్టు 8న శుభముహూర్తాన రానా - మిహీకాల వివాహం వైభవంగా జరిపించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా రానా - మిహీకాల వివాహం ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ఫ్యాలెస్ లో జరగనుంది. పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మూడు రోజులకి ఈ హోటల్ ని బుక్ చేసుకున్నారని సమాచారం. అంతేకాకుండా మార్వాడీ మరియు హైదరాబాదీ వంటకాలను సిద్ధం చేయడానికి ఇండియాలోనే ఫేమస్ చెఫ్ లను ఈ వివాహానికి పిలిపిస్తున్నారట. స్వతహాగా వెడ్డింగ్ ప్లానర్ అయిన మిహికా బ‌జాజ్‌ తన పెళ్లిని కూడా రాయల్ థీమ్ తో డిజైన్ చేస్తోందట. ఇక ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులు అతిథుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది.