Begin typing your search above and press return to search.
భల్లాలదేవుడి రథం వెనుక అసలు కథ
By: Tupaki Desk | 9 May 2017 7:18 AM‘బాహుబలి’ రెండు భాగాల్లోన భల్లాలదేవుడి రథం ప్రేక్షకుల దృష్టిని భలేగా ఆకర్షించింది. దాన్ని చాలా ఆకర్షణీయంగా.. ఆసక్తి రేకెత్తించేలా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఐతే ఆ రథం అంత వేగంతో ఎలా దూసుకురావడంలో కిటుకేంటో జనాలకు అర్థం కాలేదు. బాహుబలి సినిమాకు సంబంధించి ఏది నిజమో.. ఏది మాయో అర్థం కాదు. అందుకే ఆ రథం మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మహిమేనేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ రథానికి ముందు కనిపించే జంతువులు వీఎఫెక్స్ సృష్టే కానీ.. మిగతాదంతా మాత్రం ఒరిజినలేనట. ఆ రథం నిజంగానే అంత వేగంగా దూసుకు వచ్చేలా డిజైన్ చేశారట. మరి రథం అలా ఎలా దూసుకెళ్లిందంటే.. అందుకు కారణం రాయల్ ఎన్ ఫీల్డ్ బైకే అంటున్నాడు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్.
అవును.. భల్లాలదేవుడి రథానికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇంజిన్ ను అమర్చారట. అందుకే ఆ రథం అలా దూసుకెళ్లిందట. అంతే కాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్.. దాని వెనుక ఒక డ్రైవర్ కూడా కూర్చునేట్లు డిజైన్ చేశారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్‌తో కూడిన రథాన్ని నడిపిస్తుంటాడట. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్ బృందమే తీర్చిదిద్దిందట. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంజిన్ ను ఎక్కడైనా సులభంగా బిగించుకునే అవకాశముండటం.. భారీ బరువుల్ని లాగే సామర్థ్యం దానికి ఉండటంతో సాబు బృందం రథం కోసం ఉపయోగించుకుంది. రథం కోసం 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. బాహుబలి సినిమా కోసం సాబు బృందం ఇలాంటి చిట్కాలు మరెన్నో ఉపయోగించింది.