Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం రౌడీ స్టార్ సిక్స్ ప్యాక్
By: Tupaki Desk | 12 Oct 2020 10:45 AM ISTవిజయ్ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాను చూసి దేశ వ్యాప్తంగా ఇతడికి అభిమానులు అయ్యారు. అందుకే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యింది.
చిత్ర యూనిట్ సభ్యులు ముంబయిలో చిత్రీకరణ జరుపుతున్న సమయంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించారు. అప్పటి నుండి చిత్రీకరణ ఆగిపోయింది. మళ్లీ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే రౌడీ స్టార్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ సమయంలోనే విజయ్ గురించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి మీడియా సర్కిల్స్ తో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా అక్కడ ఎక్కువగా వసూళ్లు రాబట్టాలంటే హీరో యాక్షన్ ఓ రేంజ్ లో ఉండాలి. అందుకే విజయ్ దేవరకొండను క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ బాడీతో చూపించాలని పూరి భావిస్తున్నాడట. అందుకు విజయ్ కూడా ఓకే అని తప్పకుండా సిక్స్ ప్యాక్ కు రెడీ అవుతాంటూ పూరికి హామీ ఇచ్చాడట. విజయ్ దేవరకొండను సౌత్ ఆడియన్స్ కూడా ఎప్పుడు సిక్స్ ప్యాక్ లో చూడలేదు. మన వారికి కూడా రౌడీ స్టార్ సిక్స్ ప్యాక్ బాడీపై చాలా ఆసక్తి ఉంది.
ఫైటర్ సినిమాకు రౌడీ స్టార్ సిక్స్ ప్యాక్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలో షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.