Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ న్యూ లుక్‌ స్టిల్‌ కి ఫ్యాన్స్ ఫిదా

By:  Tupaki Desk   |   10 Dec 2022 7:36 AM GMT
రౌడీ స్టార్‌ న్యూ లుక్‌ స్టిల్‌ కి ఫ్యాన్స్ ఫిదా
X
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా ఆయనపై జనాల్లో ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా స్థాయిలో రౌడీ స్టార్‌ యొక్క క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గలేదు.

ఆయన తదుపరి సినిమా ఖుషి కోసం ప్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సమంత అనారోగ్యం కారణంగా ఖుషి సినిమా ఆలస్యం అవుతుంది. అయినా కూడా ఈ లోపు ఏదో ఒక కమర్షియల్‌ యాడ్‌ వీడియో లేదంటే సోషల్‌ మీడియా ఫొటో షూట్‌ తో అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. తాజాగా ఒక యాడ్‌ షూట్‌ లో పాల్గొన్న సందర్భంగా విజయ్ దేవరకొండ యొక్క రఫ్‌ లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించిందట.

విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమా తర్వాత జుట్టు మరియు గడ్డం ట్రిప్ చేసి చాలా క్లాస్ లుక్ కి మారాడు. ఖుషి సినిమాలో రౌడీ స్టార్‌ గుడ్ బాయ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

అయితే తాజాగా యాడ్‌ కోసం ఇలా రఫ్‌ లుక్ లో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ న్యూ లుక్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతున్నాయి. చాలా సింపుల్ టీ షర్ట్‌ లో ఆకట్టుకునే రఫ్ లుక్ తో విజయ్ దేవరకొండ ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముందు ముందు ఆయన నటించబోతున్న సినిమాల్లో ఇలా కనిపించాలని కోరుకుంటున్నాం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.