Begin typing your search above and press return to search.

ఫేవరెట్‌ హిప్‌ హాప్‌ కోసం రౌడీ స్టార్‌

By:  Tupaki Desk   |   8 Nov 2020 2:00 PM GMT
ఫేవరెట్‌ హిప్‌ హాప్‌ కోసం రౌడీ స్టార్‌
X
యూత్‌ ఐకాన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తన క్రేజ్‌ తో ఇండియాస్‌ హిప్‌ హాప్‌ షో 'షపుల్‌ 4' కు ప్రమోట్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గతంలో పలు సందర్బాల్లో హిప్‌ హాప్‌ అనేది తనకు ఇష్టమైన షో అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియాలో పలు ముఖ్య పట్టణాల్లో జరుగబోతున్న ఈ డిజిటల్‌ షో కోసం విజయ్‌ దేవరకొండ ప్రచారం చేయడంతో పాటు షో లో కనిపించే అవకాశం కూడా ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈయన 'ఫైటర్‌' సినిమాను పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే పునః ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను విజయ్‌ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఈయన సుకుమార్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా కూడా తన ఫేవరెట్‌ హిప్‌ హాప్‌ ప్రమోషన్‌ కోసం తనవంతు ప్రయత్నంను చేయబోతున్నాడు.